ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

News Anchor: పాపం ఆ న్యూస్ యాంకర్.. లైవ్‌లో నోరు జారాడు.. నవ్వులపాలయ్యాడు

ABN, First Publish Date - 2023-08-23T20:21:17+05:30

ఎంత అనర్గళంగా మాట్లాడేవాళ్లైనా సరే.. ఏదో ఒక సమయంలో అనుకోకుండా నోరు జారుతుంటారు. ఏదో చెప్పాల్సింది పోయి, పొరపాటున ఇంకేదో చెప్పేస్తుంటారు. ఇప్పుడు ఓ న్యూస్ యాంకర్ కూడా అలాగే..

ఎంత అనర్గళంగా మాట్లాడేవాళ్లైనా సరే.. ఏదో ఒక సమయంలో అనుకోకుండా నోరు జారుతుంటారు. ఏదో చెప్పాల్సింది పోయి, పొరపాటున ఇంకేదో చెప్పేస్తుంటారు. ఇప్పుడు ఓ న్యూస్ యాంకర్ కూడా అలాగే నోరు జారాడు. తనకు తెలియకుండానే ఒక చిన్న పొరపాటు చేశాడు. దీంతో.. ఆ వీడియో వైరల్ అవ్వడం, అతడు నవ్వులపాలవ్వడం జరిగింది. ఆ న్యూస్ యాంకర్ పేరు గరేత్ బార్లో. బీబీసీ న్యూస్ ఛానెల్‌లో పని చేసే ఇతడు.. ఎప్పట్లాగే లైవ్‌లో న్యూస్ చెప్పేందుకు సిద్ధమయ్యాడు.


కెమెరా స్టార్ట్ అవ్వగానే.. ‘హలో’ అనే మాట బాగానే చెప్పాడు కానీ, ఆ వెంటనే అతడు తడబడ్డాడు. ‘మీరు చూస్తున్నారు’ అనబోయి, ‘నేను చూస్తున్నాను’ అని నోరుజారాడు. అయితే.. ఆ వెంటనే తాను న్యూస్ ప్రెజెంటర్‌నని, మీరు చూస్తున్నారు బీబీసీ న్యూస్ అంటూ తన తప్పుని నవ్వుకుంటూనే సరిదిద్దుకున్నాడు. మరో విశేషం ఏమిటంటే.. తాను నోరుజారిన ఆ వీడియో క్లిప్‌ని X ప్లాట్‌ఫార్మ్‌లో షేర్ చేసి.. ‘‘అసలు ఎవరు వార్తలు చూస్తున్నారో దయచేసి నాకు గుర్తు చేయగలరా’’ అని సెటైరికల్ క్యాప్షన్ పెట్టుకున్నాడు. అంటే.. ఇతరులు ట్రోల్ చేయడానికి ముందే తనని తాను ట్రోల్ చేసుకున్నాడు గరేత్ బార్లో.

X ప్లాట్‌ఫార్మ్‌లో ఈ వీడియోకి నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. చాలామంది హిలేరియస్‌గా ఉందని నవ్వుకుంటుంటే, మరికొందరు మాత్రం ఫెంటాస్టిక్‌గా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కొందరైతే తెలివిగా సమాధానం ఇచ్చారు. ‘టెక్నికల్‌గా నువ్వు ప్యాకేజ్‌లు చూసే చదువుతావు కాబట్టి, నువ్వు చెప్పింది నిజమే బాసూ’ అని పేర్కొంటున్నారు. కాగా.. బీబీసీలో ఇలా పొరపాటు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇంకా లైవ్ నడుస్తున్నా.. యాంకర్ లుక్వెసా బురాక్ అది గ్రహించకుండా, ప్యాకేజ్ వైపు చూస్తూ కూర్చుండిపోయింది. కాసేపయ్యాక తేరుకొని, న్యూస్ చెప్పడం స్టార్ట్ చేసింది.

Updated Date - 2023-08-23T20:21:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising