ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Birmingham City Council: దివాలా తీసిన బ్రిటిన్ రెండో అతిపెద్ద నగరం.. ఆ ఖర్చులన్నీ నిలిపివేత

ABN, First Publish Date - 2023-09-06T17:10:40+05:30

ప్రపంచంలో అత్యంత సంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశాల్లో బ్రిటన్ ఒకటి. అలాంటి దేశం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా బ్రిటన్‌లో రెండో అతిపెద్ద నగరమైన బర్మింగ్‌హాట్ సిటీ కౌన్సిల్ దివాలా...

ప్రపంచంలో అత్యంత సంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశాల్లో బ్రిటన్ ఒకటి. అలాంటి దేశం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా బ్రిటన్‌లో రెండో అతిపెద్ద నగరమైన బర్మింగ్‌హాట్ సిటీ కౌన్సిల్ దివాలా తీసినట్టు మంగళవారం ప్రకటించింది. సుమార్ 10 లక్షల మందికి సేవలు అందించిన ఈ సిటీ కౌన్సిల్.. ఆర్థిక సమస్యల కారణంగా సెక్షన్ 144 నోటీస్‌ని ఫైల్ చేసింది. ఈ నేపథ్యంలో లైబ్రరీలను మూసివేయనున్నారు. అలాగే కౌన్సిల్ ట్యాక్సులు పెంచనున్నట్టు తెలుస్తోంది. అత్యవసరం కాని ఖర్చులను సైతం ఈ కౌన్సిల్ నిలిపివేసింది.


నిజానికి.. ఈ బర్మింగ్‌హాట్ సిటీ కౌన్సిల్ ఆదాయం సుమారు 4.3 బిలియన్‌ డాలర్లు. ఇది ఐరోపాలోనే అతిపెద్ద స్థానిక స్వపరిపాలన సంస్థ. ఇప్పుడు దివాలా తీయడంతో ఇది సెక్షన్ 144 నోటీస్‌ని ఫైల్ చేసింది. ఈ నగరం సమాన వేతన క్లెయిమ్‌లు 956 మిలియన్‌ డాలర్లకు చేరుకున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తమకు అదనపు సహాయం అందించాల్సిందిగా లోకల్‌ గవర్నమెంట్‌ అసోసియేషన్‌‌ను సిటీ కౌన్సిలర్లు అయిన జాన్‌ కాటన్‌, షారోన్ థాంప్సన్ కోరారు. అంతేకాదు.. తమకు అందాల్సిన 1.25 బిలియన్‌ డాలర్ల నిధులను కన్జర్వేటివ్‌ ప్రభుత్వం లాక్కుందని థాంప్సన్ ఆరోపణలు చేశారు. ఈ దుస్థితి ఏర్పడటానికి.. ఐటీ సిస్టమ్‌లోని సమస్యలు (భారీ ఖర్చులు వెచ్చించడం) కూడా ఒక కారణమని తేలింది.

ఈ ఆర్థిక సంక్షోభం నుంచి తమ సిటీ కౌన్సిల్‌ని బయటపడేసేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తామని షారోన్ థాంప్సన్ తెలిపారు. తాము ముఖ్యమైన సవాళ్లని ఎదుర్కుంటున్నప్పటికీ.. తమ విలువలకు అనుగుణంగా నివాసితులకు సేవలు అందించడానికి ప్రాధాన్యత ఇస్తామని నొక్కి వక్కాణించారు. కాగా.. ఈ సిటీ కౌన్సిల్‌కు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపు 109 మిలియన్‌ డాలర్లు అవసరం ఉంది. ఈ పరిస్థితిపై బ్రిటన్‌ ప్రధాని కార్యాలయమైన 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ స్పందిస్తూ.. అదనంగా తాము సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. అలాగే.. పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచి వచ్చే బడ్జెట్‌ను స్థానిక ప్రభుత్వాలు జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించింది.

Updated Date - 2023-09-06T17:10:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising