ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధానికి భారీ జరిమానా..!

ABN, First Publish Date - 2023-01-21T13:26:12+05:30

బ్రిటన్‌ ప్రధాని రుషి సునాక్‌ (Rishi Sunak) ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు అక్కడి పోలీసులు భారీ జరిమానా విధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: బ్రిటన్‌ ప్రధాని రుషి సునాక్‌ (Rishi Sunak) ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు అక్కడి పోలీసులు భారీ జరిమానా విధించారు. కారులో ప్రయాణిస్తూ సీటుబెల్ట్‌ ధరించనందుకు 100 పౌండ్లు (రూ.10వేలు) ఫైన్ విధించినట్లు లాంక్‌షైర్ పోలీసులు (Lancashire Police) వెల్లడించారు. కాగా, తన ప్రభుత్వ కార్యకలాపాలపై ఓ సోషల్‌ మీడియా వీడియో చిత్రీకరణ సమయంలో ఆయన కారులో కాసేపు సీటుబెల్ట్‌ తొలగించారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం రాజుకుంది. దేశ ప్రధాని ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ఏంటని ప్రతిపక్షాల విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. దీంతో రిషి సునాక్ క్షమాపణలు కూడా చెప్పారు. ఇక బ్రిటన్ చట్టాల ప్రకారం కారులో ప్రయాణించే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాల్సి ఉంటుంది. అత్యవసర వైద్యం పొందాల్సిన వ్యక్తి మినహా ప్రతీఒక్కరూ సీటు బెల్టు వేసుకోవాల్సిందే. లేనిపక్షంలో 100 పౌండ్ల జరిమానా చెల్లించాలి.

Updated Date - 2023-01-21T13:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising