ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Justin Trudeau: అదొక సిగ్గుమాలిన సంఘటన, కెనడియన్లకు ఇబ్బంది గురి చేసింది.. మరో బాంబ్ పేల్చిన జస్టిన్ ట్రూడో

ABN, First Publish Date - 2023-09-26T15:40:06+05:30

ఈమధ్య కెనడా వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇప్పటికే ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంపై భారత్‌పై నిరాధార ఆరోపణలు చేసి అభాసుపాలయ్యింది. ఇది చాలదన్నట్టు..

ఈమధ్య కెనడా వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇప్పటికే ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంపై భారత్‌పై నిరాధార ఆరోపణలు చేసి అభాసుపాలయ్యింది. ఇది చాలదన్నట్టు.. జర్మనీ నియంత హిట్లర్‌తో కలిసి పోరాడిన నాజీ డివిజన్ సైనికుడిని పార్లమెంట్‌ సాక్షిగా గౌరవించి విమర్శలపాలవుతోంది. ఈ నేపథ్యంలోనే కెనడా ప్రధాని తొలిసారి ఈ సంఘటనపై స్పందించారు. ఇదొక సిగ్గుమాలిన ఘటన అని, ఇది కెనడియన్లను ఇబ్బందికి గురి చేసే విషయమని పేర్కొన్నారు. ‘‘ఈ ఘటన కెనడా పార్లమెంట్‌కు, కెనడియన్లకు అత్యంత ఇబ్బందికర పరిణామం. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాదు’’ అని జస్టిన్ ట్రూడో బదులిచ్చారు.

అసలేం జరిగింది?

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల కెనడాలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా గత శుక్రవారం (22-09-23) శుక్రవారం పార్లమెంట్‌కు వచ్చారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌ ఆంటోనీ రోటా ఉక్రెయిన్‌ నుంచి వలస వచ్చిన రెండో ప్రపంచ యుద్ధం మాజీ సైనికుడు యారోస్లోవ్‌ హంకా(98)ను ఆహ్వానించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రష్యా నుంచి ఉక్రెయిన్‌కి స్వేచ్ఛ ఇచ్చిన యోధుడిగా హంకాని కీర్తించారు. అప్పుడు జస్టిన్ ట్రూడో, జెలెన్‌స్కీతో పాటు అక్కడున్న వారందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అది కూడా రెండుసార్లు.


ఈ చర్యపై యూదులు మండిపడ్డారు. హంకా చేతులు యూదుల రక్తంతో తడిశాయని, అలాంటి వ్యక్తిని ఎలా సత్కరిస్తారని ప్రశ్నించారు. దీంతో.. ఈ మొత్తం వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన స్పీకర్ ఆంటోనీ రోటా యూదులకు క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ.. ట్రూడో ప్రభుత్వంపై విమర్శలు ఆగలేదు. హంకా గురించి వివరాలు తెలుసుకోకుండా, అతడ్ని ఎలా ఆహ్వానించారని ప్రశ్నలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. స్పీకర్ ఆంటోనీ రోటా అతడ్ని యుద్ధ వీరుడిగా పేర్కొనడంతో, స్పీకర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్లు పెరిగాయి.

అటు.. రష్యా సైతం హంకాని సత్కరించిన చర్యపై తీవ్రంగా మండిపడింది. ఇది అత్యంత దారుణమైన చర్య అని, నాజీ నేరాలని గుర్తుంచుకోవాలని సూచించింది. నాజీలకు కెనడా స్వర్గధామంగా మారిందని ఘాటుగా స్పందించింది కూడా. కేవలం క్షమాపణలు చెప్తే సరిపోదని, పోలండ్‌ ప్రజలపై నాజీ డివిజన్ హేయమైన ఆకృత్యాలకు పాల్పడిందో గుర్తు చేసుకోవాలని, ఈ చర్య బాధించిందని కెనడాలోని పోలండ్ రాయబారి కూడా విరుచుకుపడ్డారు. ఇలా విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే.. కెనడా ప్రధాని ట్రూడో పైవిధంగా స్పందించారు.

Updated Date - 2023-09-26T15:40:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising