Canada:41 మంది దౌత్యవేత్తలను రీకాల్ చేసిన కెనడా..
ABN, First Publish Date - 2023-10-20T09:14:38+05:30
భారత ప్రభుత్వం విధించిన గడువు ముగిసిన తరువాత కెనడా ప్రభుత్వం 41 మంది దౌత్యవేత్తలను(Diplomats) ఉపసంహరించుకుంది. ఒట్టావా ప్రతీకార చర్యలు తీసుకోదని విదేశాంగ మంత్రి మెలానీ జోలి అన్నారు.
ఢిల్లీ: భారత ప్రభుత్వం విధించిన గడువు ముగిసిన తరువాత కెనడా ప్రభుత్వం 41 మంది దౌత్యవేత్తలను(Diplomats) ఉపసంహరించుకుంది. ఒట్టావా ప్రతీకార చర్యలు తీసుకోదని విదేశాంగ మంత్రి మెలానీ జోలి అన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్యపై భారత్ - కెనడా(India - Canada)ల మధ్య దౌత్యపర ఇబ్బందులు ఎదురయ్యాయి. తమ గడ్డపై నిజ్జర్ ని హత్య చేయించింది భారత్ అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justine Trudo) ఆరోపించగా.. దాన్ని భారత్ ఖండించింది. రాజకీయ దురుద్ధేశంతో కెనడా ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది.
దీంతో ఇరు దేశాల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఇండియా కఠిన నిర్ణయం తీసుకుంది. కెనడా తన 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించాలని కోరింది. అక్టోబర్ 10లోగా 41 మంది దౌత్యవేత్తలను రీకాల్ చేయాలని కెనడాను భారత్ స్పష్టం చేసింది. లేదంటే వారి అధికారాలు రద్దు చేస్తామని భారత్ హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇండియాలో కెనడాకు చెందిన 62 మంది దౌత్యవేత్తలు ఉన్నారు. అయితే గడువు ముగిసిన 10 రోజుల తరువాత కెనడా తమ దౌత్యవేత్తలను స్వదేశానికి పిలిపించుకుంది. అయితే భారత్ నిర్ణయంపై కెనడా ప్రభుత్వం మండిపడుతోంది. ఇండియా ఇలాంటి అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఆ దేశ అధికారులు అంటున్నారు.
Updated Date - 2023-10-20T09:14:38+05:30 IST