ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israel-Hamas: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై ప్లేటు తిప్పేసిన చైనా.. ఆ హక్కు ఉందంటూ పెద్ద షాకిచ్చిందిగా!

ABN, First Publish Date - 2023-10-24T16:16:10+05:30

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంపై ఇప్పటికే చాలా దేశాలు అనుసరిస్తున్న వైఖరిపై ఒక క్లారిటీ వచ్చింది. ఏయే దేశాలు ఎవరెవరికి మద్దతు తెలుపుతున్నాయో తేల్చేశాయి. కానీ.. చైనా అనుసరిస్తున్న వైఖరిపై మాత్రం తీవ్ర విమర్శలు...

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంపై ఇప్పటికే చాలా దేశాలు అనుసరిస్తున్న వైఖరిపై ఒక క్లారిటీ వచ్చింది. ఏయే దేశాలు ఎవరెవరికి మద్దతు తెలుపుతున్నాయో తేల్చేశాయి. కానీ.. చైనా అనుసరిస్తున్న వైఖరిపై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే.. ఇది హమాస్ దాడిని ఖండించడమో, ఇజ్రాయెల్‌కి మద్దతు తెలపడమో చేయలేదు. కేవలం ఇరు దేశాల మధ్య జరుగుతున్న కాల్పుల విరమణకు మాత్రమే పిలుపునిచ్చింది. అలాగే.. పాలస్తీనా సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు గాను ఈజిప్ట్‌తో పాటు ఇతర అరబ్ దేశాలతో కలిసి సమన్వయం చేస్తామని తెలిపింది.


అలాంటి డ్రాగన్ కంట్రీ ఇప్పుడు ఈ యుద్ధంపై తన స్వరం మార్చేసింది. తమపై మెరుపుదాడులు చేసిన హమాస్‌పై చర్యలు తీసుకునే హక్కు ఇజ్రాయెల్‌కి ఉందంటూ కుండబద్దలు కొట్టింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈమేరకు సోమవారం వ్యాఖ్యానించారు. ప్రతి దేశానికీ తనని తాను కాపాడుకునే హక్కు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే.. అంతర్జాతీయ మావనతా చట్టాలకు అనుగుణంగా, సామాన్య పౌరులకు రక్షణ కల్పించే విధంగా ఆ చర్యలు ఉండాలని సూచించారు. ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి ఎలీ కోహెన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ.. వాంగ్ యీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌కు పరోక్షంగానైనా చైనా తన మద్దతు తెలపడం ఇదే మొదటిసారి. త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్తున్న తరుణంలో వాంగ్ యీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇదే సమయంలో.. ఈ యుద్ధ తీవ్రత రోజురోజుకీ తీవ్రమవుతోందంటూ వాంగ్ యీ విచారం వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా.. పెద్దఎత్తున సామాన్య పౌరులు మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తపరిచారు. సామాన్యులకు హాని కలిగించే అన్ని చర్యలను వెంటనే ఆపేయాలని, ఈ విషయంలో చైనాకు ఎలాంటి స్వార్థ ఆలోచనలు లేవని తెలిపారు. ఇరు పక్షాల మధ్య ఘర్షణలు వీలైనంత త్వరగా సమిపోవాలని, పలితంగా అన్ని దేశాల ఆందోళనలకు ఒక మార్గం లభిస్తుందని ఆకాంక్షించారు. మరణాల్ని నిరోధించడమే ప్రధాన లక్ష్యమన్న ఆయన.. ‘టూ-స్టేట్స్ సొల్యూషన్’ ఆధారంగా పాలస్తీనా సమస్య సమగ్రంగా, న్యాయబద్ధంగా పరిష్కరించబడుతుందని వాంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-24T16:16:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising