ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Xi Jinping: పుతిన్ బాటలోనే జీ జిన్‌పింగ్.. భారత్‌లో జీ20 సమ్మిట్‌కి డుమ్మా.. కారణం ఇదేనా!

ABN, First Publish Date - 2023-08-31T18:15:25+05:30

భారత్‌లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీ20 సమ్మిట్‌కి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రావడం లేదని ఇప్పటికే కన్ఫమ్ అయ్యింది. స్వయంగా ఆయనే ప్రధాని మోదీకి ఫోన్ చేసి.. తాను ఈ సదస్సుకి రాలేనని...

భారత్‌లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీ20 సమ్మిట్‌కి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రావడం లేదని ఇప్పటికే కన్ఫమ్ అయ్యింది. స్వయంగా ఆయనే ప్రధాని మోదీకి ఫోన్ చేసి.. తాను ఈ సదస్సుకి రాలేనని, రష్యా తరఫున విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్‌‌ను పంపుతున్నామని తెలిపారు. ఇప్పుడు పుతిన్ బాటలోనే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా జీ20 సదస్సుకు హాజరుకాకపోవచ్చు. జిన్‌పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ఉన్నతస్థాయి అధికారులను ఉటంకిస్తూ.. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి.


నిజానికి.. భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలకు చెక్ పెట్టేందుకు ప్రధాని మోదీ, జీ జిన్‌పింగ్ మధ్య ఈ జీ20 సదస్సులో ద్వైపాక్షిక చర్చలు జరగొచ్చని అంతా భావించారు. కానీ.. ఇప్పుడు ఆయన ఈ సదస్సుకి రావడం లేదు కాబట్టి ఆ చర్చలకు అవకాశం లేకుండా పోయింది. అయితే.. జీ జిన్‌పింగ్ ఈ జీ20 సమ్మిట్‌కు హాజరు కాకపోవడానికి గల సరైన కారణాలు మాత్రం తెలియరాలేదు. అంతకుముందు బ్రిక్స్ సదస్సులో మోదీ, జిన్‌పింగ్ కలిసినప్పుడు కూడా వారి మధ్య ద్వైపాక్షిక భేటీ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ.. ఆ ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారే తప్ప ద్వైపాక్షిక చర్చలు జరపలేదు.

ఇదిలావుండగా.. కొంతకాలం నుంచి భారత్, చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి. 2020 జూన్‌లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికు ఘర్షణ పడగా.. 20 జవాన్లు ఈ ఘటనలో అమరులు అయ్యారు. ఇక అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగిపోయాయి. ఇది చాలదన్నట్టు.. 2023 ఎడిషన్ పేరుతో చైనా విడుదల చేసిన మ్యాప్ మరో వివాదానికి దారితీసింది.ఈ మ్యాప్‌లో సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయ్‌ చిన్‌, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రాలను తమ దేశంలోని భూభాగాలుగా పేర్కొంది. దీనిపై భారత్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated Date - 2023-08-31T18:15:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising