Cyclone: న్యూజిలాండ్‌ను వణికించిన తుపాన్...భారీవర్షాలు, గాలులు
ABN, First Publish Date - 2023-02-13T12:13:28+05:30
న్యూజిలాండ్ దేశాన్ని గాబ్రియెల్ తుపాన్ వణికించింది....
వెల్లింగ్‌టన్: న్యూజిలాండ్ దేశాన్ని గాబ్రియెల్ తుపాన్ వణికించింది.(Cyclone) సోమవారం న్యూజిలాండ్(New Zealand) ఎగువ నార్త్ ఐలాండ్‌లో సంభవించిన తుపాన్ వల్ల 58వేలకుపైగా ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. న్యూజిలాండ్ దేశంలో తుపాన్ విపత్తు వల్ల బలమైన గాలులు, భారీ వర్షాలు కురిశాయి.(Strong winds,Rain) గాబ్రియెల్ తుపాన్ టాస్మాన్ సముద్రంలోని నార్ఫోక్ ద్వీపం యొక్క ఆస్ట్రేలియన్ భూభాగాన్ని దాటింది. తుపాన్ విపత్తు భారీ అలలను తీసుకువచ్చింది.సోమ, మంగళవారాల్లో ఈ తుపాన్ భూమికి దగ్గరగా ఉన్నందున భారీవర్షం, గాలులు తీవ్రతరం అవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
ఇది కూడా చదవండి : Womens T20 World Cup : టీంఇండియా మహిళా జట్టుకు కోహ్లీ, టెండూల్కర్ ప్రశంసలు
గాబ్రియెల్ తుపాన్ ప్రభావం మంగళవారం ఉదయం వరకు మరింత తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నామని ఆక్లాండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ డిప్యూటీ కంట్రోలర్ రాచెల్ కెల్లెహెర్ సోమవారం తెలిపారు.తుపాన్ వల్ల ఆక్లాండ్, ఇతర ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులు అమలులో ఉన్నాయి.ఆక్లాండ్‌కు ఉత్తరాన ఉన్న వాంగరేయ్ నగరంలో గత 12 గంటల్లో 100.5 మిమీ వర్షం కురిసిందని, ఆక్లాండ్ తీరంలో గంటకు 159 కిలోమీటర్ల మేర గాలులు నమోదయ్యాయని వాతావరణ సంస్థ మెట్‌సర్వీస్ తెలిపింది.
ఇది కూడా చదవండి : Triple Talaq : భార్యకు ట్రిపుల్ తలాఖ్...విమానాశ్రయంలో భర్త అరెస్ట్
విమానాలు, ఫెర్రీలు, బస్సులు, రైళ్లలో ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు చెప్పారు.తుపాన్ కారణంగా 509 విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ న్యూజిలాండ్ తెలిపింది.గత నెలలో ఆక్లాండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురవడం కారణంగా వరదలు సంభవించి నలుగురు మరణించారు.
Updated Date - 2023-02-13T12:13:29+05:30 IST