ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hamas- Israel war: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ సీనియర్ కమాండర్ హతం.. పాపం 50 మంది అమాయక ప్రజలు కూడా..

ABN, First Publish Date - 2023-11-01T09:21:39+05:30

ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ వైమానిక దాడుల్లో హమాస్ సీనియర్ కమాండర్ ఇబ్రహీం బియారీ మరణించారు.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ వైమానిక దాడుల్లో హమాస్ సీనియర్ కమాండర్ ఇబ్రహీం బియారీ మరణించారు. హమాస్‌ను చంపేందుకు ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు కూడా చనిపోయారు. అలాగే 50 మంది అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 7న తమపై జరిగిన దాడుల్లో ఇబ్రహీం బియారీ కీలకపాత్ర పోషించారని ఇజ్రాయెల్ చెబుతోంది. దీంతో ఇబ్రహీం బియారీని అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌లతో విరుచుకుపడింది. బియారీ ఉంటున్న ప్రాంతంలో వైమానిక దాడులు చేసింది. అయితే బియారీని అంతమెందించడం కోసం ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులు దగ్గరలో ఉన్న శరణార్థుల శిబిరాన్ని తాకాయి. దీంతో 50 మంది అమాయకులైన సాధారణ పాలస్తీనియన్ ప్రజలు కూడా మరణించారు. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారికి చికిత్స చేసేందుకు వైద్యులు క‌ృషి చేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో ఆ ప్రాంతం పూర్తిగా నాశనమైంది. భూగర్భ మౌలిక సదుపాయాలు కూలిపోయాయి. దీంతో ఆ ప్రాంత నివాసులను వారి భద్రత కోసం దక్షిణాది ప్రాంతానికి వెళ్లాని ఐడీఎఫ్ పిలుపునిచ్చింది.


కాగా ఇబ్రహీం బియారీ చనిపోయిన విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో అధికారికంగా ప్రకటించింది. ‘‘ఐడీఎఫ్ ఫైటర్ జెట్‌లు హమాస్ సెంట్రల్ జబాలియా బెటాలియన్ కమాండర్ ఇబ్రహీం బియారీని అంతమొందించాయి. ఇజ్రాయెల్‌లో అక్టోబరు 7న జరిగిన ఉగ్రవాద దాడికి కారణమైన నాయకులలో బియారీ ఒకరు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ కమాండ్, కంట్రోల్ ప్రాంతం దెబ్బతింది. బియారీతోపాటు పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు కూడా చనిపోయారు. అలాగే భూగర్భ ఉగ్రవాద మౌలిక సదుపాయాలు కూలిపోయాయి. భద్రత దృష్యా స్థానికులను దక్షిణానికి వెళ్లాలని ఐడీఎఫ్ సూచించింది.’’ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ పేర్కొంది. అయితే ఇబ్రహీం బియారీని చంపేందుకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజా స్ట్రిప్‌లో అతిపెద్దదైన శరణార్థి శిబిరంలో ఉన్న అనేకమంది పాలస్తీనియన్లు మరణించారని, 150 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. అక్కడ హమాస్ కమాండర్ ఎవరూ లేరని హమాస్ ప్రతినిధి హజెమ్ ఖాస్సెమ్ చెప్పారు. దీంతో ఇబ్రహీం బియారీ చనిపోయారనే వార్తలను హమాస్ ఖండిచినట్టైంది. పైగా ఇబ్రహీం బియారీ చనిపోయినట్టు హమాస్ ప్రకటించలేదు. సాధారణ పౌరులను చంపడానికి ఇజ్రాయెల్ ఇదొక సాకుగా చెబుతోందని పాలస్తీనా అధికారారులు చెబుతున్నారు. అలాగే 1948 నాటి యుద్ధం తర్వాత వచ్చిన శరణార్థుల కుటుంబాలు ఉన్న జబాలియాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 400 మంది చనిపోయారని హమాస్ తీవ్రవాద బృందం ఓ ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2023-11-01T09:21:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising