ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pakistan blast: పాక్ అణు కార్యాలయం సమీపంలో భారీ పేలుడు..

ABN, First Publish Date - 2023-10-06T17:21:18+05:30

పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని డేరా ఘాజీ ఖాన్ ప్రాంతంలో ఉన్న పాక్ ఆటమిక్ కమిషన్ కార్యాలయం సమీపంలో శుక్రవారంనాడు భారీ పేలుడు సంభవించింది. బలూచిస్థా్న్, కైబర్ ఫఖ్తుంక్వా ప్రావిన్స్‌లతో సహా సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకూ పేలుడు శబ్దం వినిపించడం ప్రజలు భయోత్పాతానికి లోనయ్యారు.

ఇస్లామాబాద్: పాకిస్థాన్ (pakistan) పంజాబ్ ప్రావిన్స్‌లోని డేరా ఘాజీ ఖాన్ (Dera Ghazi Khan) ప్రాంతంలో ఉన్న పాక్ ఆటమిక్ కమిషన్ కార్యాలయం (Atomic commission office) సమీపంలో శుక్రవారంనాడు భారీ పేలుడు (huge blast) సంభవించింది. బలూచిస్థా్న్, కైబర్ ఫఖ్తుంక్వా ప్రావిన్స్‌లతో సహా సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకూ పేలుడు శబ్దం వినిపించడం ప్రజలు భయోత్పాతానికి లోనయ్యారు. దీంతో పేలుడు ప్రాంతం, ఆ పరిసరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.


పేలుడు జరగగ్గానే అగ్నిమాపక శకటాలు, అంబులెన్స్‌లు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. పేలుడుకు కారణాలు కానీ, పేలుడులో ఎవరైనా మృతిచెందారా అనేది కానీ వెంటనే తెలియలేదు. అయితే, ఈ భారీ పేలుడు వెనుక డ్రోన్‌ దాడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంక్వా ప్రావిన్స్‌లో వరుస ఆత్మాహతుల దాడుల్లో 65 మంది వరకూ మరణించిన క్రమంలో తాజా పేలుడు తీవ్ర ఆందోళనకు గురిచేసింది.


కాగా, పాకిస్థాన్‌లో ఈ ఏడాది ఒక్క సెప్టెంబర్‌లోనే 99 దాడులు జరిగాయి. పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (పీఐసీఎస్ఎస్) గణాంకాల ప్రకారం ఈ దాడుల్లో 112 మంది వరకూ మరణించగా, 87 మంది గాయపడ్డారు. భద్రతా బలగాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి.

Updated Date - 2023-10-06T17:23:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising