ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. తానే అధ్యక్షుడినైతే ఆ రెండు పనులు చేస్తానంటూ వాగ్ధానం

ABN, First Publish Date - 2023-10-17T20:35:28+05:30

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకెక్కే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే.. హమాస్‌కు మద్దతు ఇచ్చే వలసదారులను యుఎస్‌లోకి..

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకెక్కే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే.. హమాస్‌కు మద్దతు ఇచ్చే వలసదారులను యుఎస్‌లోకి ప్రవేశించకుండా నిషేధిస్తానని అన్నాడు. అంతేకాదు.. పాలస్తీనా మిలిటెంట్ గ్రూపుకు అనుకూల నిరసనల ద్వారా బహిరంగంగా మద్దతిచ్చే వలసదారుల్ని అరెస్ట్ చేయడానికి, వారిని శాశ్వతంగా బహిష్కరించడానికి అధికారుల్ని పంపుతానని కూడా వాగ్ధానం చేశాడు. ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించని ఎవరినైనా.. యూఎస్‌లో ప్రవేశించడాన్ని నిషేధిస్తానన్నాడు. యాంటీసిమిటిక్ అయిన అయిన విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తానని హామీ ఇచ్చాడు. ఉగ్రవాద పీడత దేశాల నుంచి ప్రయాణాల్ని పూర్తిగా నిషేధిస్తానని కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేశాడు.


గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ అనేక ఇమ్మిగ్రేషన్ విధానాలు కోర్టులో సవాలు చేయబడ్డాయి. ఇప్పుడు అతడు కొత్తగా చేస్తున్న వాగ్దానాలు కూడా సవాళ్లను ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. కొన్ని ముస్లిం-మెజారిటీ దేశాల నుండి వలస వచ్చిన వారిపై అతను విధించిన నిషేధం దిగువ కోర్టుల్లో కొట్టివేయబడింది. అయితే.. యూఎస్ సుప్రీంకోర్టు మాత్రం ట్రంప్ విధానాన్ని సమర్థించింది. కానీ.. జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేశాడు. ఇప్పుడు తాను తిరిగి అధికారంలోకి వస్తే మాత్రం.. తాను హామీ ఇచ్చినట్టుగా నిషేధాలు అమలు చేస్తానని ట్రంప్ మాటిచ్చాడు. లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్‌లతో నాటు అమెరికా భద్రతకు ముప్పు కలిగించే మరే దేశం నుంచైనా.. వలసదారులను నిషేధిస్తానని తన ప్రచార కార్యక్రమంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ బల్లగుద్ది మరీ చెప్పాడు. వలసదారులను ప్రాణాంతక పాములతో పోల్చాడు.

అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేస్తానని ట్రంప్ వాగ్ధానం చేస్తూ.. ‘‘మీరు ఇజ్రాయెల్ రాజ్యాన్ని రద్దు చేయాలనుకుంటే మీరు అనర్హులు. మీరు హమాస్ లేదా హమాస్ వెనకున్న భావజాలానికి మద్దతు ఇస్తే మీరు అనర్హులు. మీరు కమ్యూనిస్టు, మార్క్సిస్ట్, లేదా ఫాసిస్ట్ అయితే మీరు అనర్హులు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ట్రంప్‌తో పాటు రిపబ్లికన్ ప్రత్యర్థులు సైతం హమాస్ దాడుల్ని ఖండించారు. గాజాపై ఇజ్రాయెల్ దండయాత్రకు పూర్తి మద్దతు తెలిపారు. కానీ.. ట్రంప్ తరహాలో అమెరికా నుంచి హమాస్ సానుభూతిపరుల్ని బహిష్కరిస్తామన్న ప్రతిపాదనల్ని మాత్రం రూపొందించలేదు.

Updated Date - 2023-10-17T20:35:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising