ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

USA: ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధ తీవ్రత పెరిగితే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుంది: లిండ్సే గ్రాహం

ABN, First Publish Date - 2023-10-23T08:52:40+05:30

ఇజ్రాయెల్ - హమాస్(Israel–Hamas)ల మధ్య యుద్ధ తీవ్రత పెరిగితే ఇరాన్(Iran) భారీ మూల్యం చెల్లించుకుంటుందని అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం( Lindsey Graham) హెచ్చరించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం పెరిగితే.. అది ఇరాన్ పెరట్లోకి వస్తుందని హెచ్చరించారు.

న్యూయార్క్: ఇజ్రాయెల్ - హమాస్(Israel–Hamas)ల మధ్య యుద్ధ తీవ్రత పెరిగితే ఇరాన్(Iran) భారీ మూల్యం చెల్లించుకుంటుందని అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం( Lindsey Graham) హెచ్చరించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం పెరిగితే.. అది ఇరాన్ పెరట్లోకి వస్తుందని హెచ్చరించారు. అయితే ఈ దాడుల వెనక ఆ దేశం లేదనే వాదనను ఆయన తోసిపుచ్చారు. ఈ వాదన తనకు నవ్వు తెప్పిస్తోందని ఆయన వ్యంగ్యంగా స్పందించారు. అప్పుడు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.


అక్టోబర్ 7 న జరిగిన హమాస్(Hamas) దాడిలో ఇరాన్ ప్రమేయం ఉందని ఆరోపించారు. దీంతో ఇజ్రాయెల్ ప్రతి దాడికి దిగింది. ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడులను సమన్వయం చేయడంలో ఇరాన్ ప్రమేయం ఉండే ఛాన్స్ ఉందని న్యూయార్క్ పోస్ట్ గతంలో నివేదించింది. అది తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ నాయకులు. లెబనాన్(Lebanon) ఆధారిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా, హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై దాడి చేసేందుకు ట్రైనింగ్ ఇచ్చారు. వారిదగ్గర ఉన్న అధునాతన టెక్నాలజీతో శిక్షణ పొందారు. ఇజ్రాయెల్ పై హమాస్ దాడుల కోసం సంవత్సరానికిపైగా శిక్షణ పొందిందని ఆ నివేదిక వెల్లడించింది. అయితే దాడుల వెనక ఇరాన్ ఉందనే ఆధారాన్ని ఇజ్రాయెల్ అధికారులు స్పష్టంగా కనుక్కోలేదు. అయితే అమెరికా తదితర దేశాలు చేస్తున్న ఆరోపణల్ని ఇరాన్ ఖండిస్తోంది. తాము ఎలాంటి ఉగ్రవాద సంస్థకు శిక్షణ ఇవ్వలేదని.. హమాస్ దాడుల వెనక తమ ప్రమేయం లేదని ఆ దేశం వాదిస్తోంది.

Updated Date - 2023-10-23T08:52:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising