ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan: బాబోయ్! ఇవెక్కడి కండిషన్లు.. అయినా తప్పట్లేదు!

ABN, First Publish Date - 2023-02-03T18:07:14+05:30

ఆర్థిక సంక్షోభం(Economic Crisis)లో కూరుకుపోయి నానా కష్టాలు పడుతున్న పాకిస్థాన్‌(Pakistan)కు ఆర్థిక సాయం అందించేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభం(Economic Crisis)లో కూరుకుపోయి నానా కష్టాలు పడుతున్న పాకిస్థాన్‌(Pakistan)కు ఆర్థిక సాయం అందించేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund) ఎట్టకేలకు ఓకే చెప్పింది. అయితే, అది విధించిన కండిషన్లు మాత్రం పాకిస్థాన్‌ను బెంబేలెత్తిస్తున్నాయి. అయినప్పటికీ మరో దారిలేకపోవడంతో తలూపక తప్పని పరిస్థితి నెలకొంది. ఐఎంఎఫ్(IMF) విధించిన నిబంధనలు ఊహకు కూడా అందనంత కఠినంగా ఉన్నాయని పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్(Shehbaz Sharif) ఆవేదన వ్యక్తం చేశారు. దేశం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐఎంఎఫ్ నిబంధనలకు అంగీకరించాల్సిందేనని, తమ ముందు మరో మార్గం లేదని చెప్పుకొచ్చారు.

పాకిస్థాన్‌కు నెలల తరబడి నిలిచిపోయిన ఆర్థిక సాయాన్ని పునరుద్ధరించేందుకు చివరి విడత చర్చల కోసం ఐఎంఎఫ్ ప్రతినిధి బృందం మంగళవారం పాకిస్థాన్‌కు చేరుకుంది. పన్నుల పెంపు, రాయితీల తొలగింపు వంటి వాటిని అమలు చేయాలని ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో ఐఎంఎఫ్ బృందం పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అయితే, ఈ ఏడాది అక్టోబరులో ఎన్నికలు జరగనుండడంతో ఇవి కనుక అమలు చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత తప్పదు. ఇప్పటికే తిండి కోసం అల్లాడిపోతున్న ప్రజలపై భారం పెంచితే ఎన్నికల్లో వారి ఆగ్రహాన్ని చవిచూడాల్సి రావొచ్చు. కాబట్టి ఈ నిబంధనలపై పాక్ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో వాటికి అంగీకరించక తప్పని పరిస్థితి నెలకొంది.

‘‘నేనీ విషయంలో వివరాల్లోకి వెళ్లదలచుకోలేదు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి ఊహకు కూడా అందడం లేదు. కాబట్టి ఐఎంఎఫ్ నిబంధనలను అంగీకరించాల్సిందే. వారి కండిషన్లు చాలా కఠినంగా ఉన్నప్పటికీ ఓకే చెప్పక తప్పని పరిస్థితి నెలకొంది’’ అని పాక్ ప్రధాని షేబాజ్ అన్నారు.

పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. అప్పుల్లో కూరుకుపోయి బయటపడలేక నానా అగచాట్లు పడుతోంది. సమతుల్యత దెబ్బతినడంతో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. మరోవైపు రాజకీయ గందరగోళం నెలకొంది. దేశంలో విదేశీ మారక నిల్వలు 3.1 బిలియన్ డాలర్లకు పడిపోయినట్టు ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ గురువారం ప్రకటించింది. ఈ నిల్వలు మూడు వారాల దిగుమతులకు కూడా సరిపోవని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ నిబంధనలను అంగీకరించడం ద్వారా ముందు కష్టాల నుంచి బయటపడాలని పాక్ యోచిస్తోంది.

Updated Date - 2023-02-03T18:12:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising