ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Imran Khan: మరో వివాదంలో ఇమ్రాన్ ఖాన్.. పెళ్లికి ముందు ఆమెతో అక్రమ సంబంధం.. బయటపెట్టిన పనోడు

ABN, First Publish Date - 2023-12-06T19:17:56+05:30

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను వరుస వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడప్పుడే ఆయన కష్టాలు తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. రోజురోజుకు ఆయన పేరు ఏదో ఒక వివాదంతో ముడిపడి ఉంటోంది..

Imran Khan & Bushra Bibi: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను వరుస వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడప్పుడే ఆయన కష్టాలు తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. రోజురోజుకు ఆయన పేరు ఏదో ఒక వివాదంతో ముడిపడి ఉంటోంది. ఇప్పుడు బుష్రా బీబీ మాజీ భర్త ఖవార్ ఫరీద్ వద్ద ఎంతో నమ్మకంగా పని చేస్తున్న మహమ్మద్ లతీఫ్ అనే సేవకుడు ఒక సంచలన విషయాన్ని బయటపెట్టాడు. ఇమ్రాన్, బుష్రా బీబీ పెళ్లి చేసుకోవడానికి ముందు వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నారని అతడు కోర్టులో చెప్పాడు.


ఇమ్రాన్ తరచూ ఇంటికి వచ్చేవాడని, వారిద్దరూ ఒకే గదిలో గంటల తరబడి గడిపేవారని లతీఫ్ కోర్టులో చెప్పినట్లు ఓ వార్తా పత్రిక డిసెంబర్ 5వ తేదీన నివేదించింది. ఇమ్రాన్, బుష్రా వివాహేతర సంబంధానికి తానే ప్రత్యక్ష సాక్షినని కూడా అంగీకరించాడు. ఇస్లామాబాద్‌లోని సివిల్ జడ్జి ఖుదర్తుల్లా కోర్టులో లతీఫ్ ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చాడు. గదిలోకి వెళ్లి వాళ్లిద్దరు (ఇమ్రాన్, బుష్రా బీబీ) ఓ కన్నేసి ఉంచమని తన యజమాని ఫరీద్ తనకు చెప్పేవారని, అయితే తాను గదిలోకి వెళ్లినప్పుడు వాళ్లు తనని దుర్బాషలాడి బయటకు పంపించేవారని పేర్కొన్నాడు. వాళ్లిద్దరు గదిలో ఎలా గడిపేవారో కూడా తాను చూశానని, దాంతో ఆ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్న విషయం బట్టబయలు అయ్యిందని తెలిపాడు.

అయితే.. ఈ ఆరోపణల్ని ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చాడు. తమ మధ్య ఎలాంటి అక్రమ సంబంధం లేదని, నికాహ్ రోజున మాత్రమే తాను బుష్రా బీబీ ముఖం చూశానని పేర్కొన్నాడు. తన ఇమేజ్‌ని దెబ్బతీసేందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పాడు. అసలు పెళ్లికి ముందు తామెప్పుడూ కలుసుకోలేదని స్పష్టం చేశాడు. కాగా.. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 8న వాయిదా వేసింది. అంతకుముందు.. బుష్రా బీబీ మాజీ భర్త ఫరీద్ కూడా ఓ సంచలన ప్రకటన చేశాడు. ఇమ్రాన్, బుష్రా ‘ఇద్దత్’ సమయంలో పెళ్లి చేసుకున్నారని చెప్పాడు. ఇద్దత్ అంటే.. ఒక ముస్లిం మహిళ తన భర్త మరణం లేదా విడాకుల తర్వాత వేచి ఉండే కాలం.

Updated Date - 2023-12-06T19:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising