India vs Canada: కెనడాకు సపోర్ట్ చేయాలని యూఏఈని కోరిన ట్రూడో
ABN, First Publish Date - 2023-10-09T07:42:51+05:30
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar)ను భారత ప్రభుత్వమే హత్య చేయించిందని ఆరోపిస్తున్న కెనడా పీఎం జస్టిన్ ట్రూడో(Justine Trudo).. ఈ విషయంలో ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. తాజాగా ఆయన యూనిటెడ్ అరబ్ ఎమిరెట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్(Shaik Mahomoodbin Jayed)తో భేటీ అయ్యారు.
కెనడా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar)ను భారత ప్రభుత్వమే హత్య చేయించిందని ఆరోపిస్తున్న కెనడా పీఎం జస్టిన్ ట్రూడో(Justine Trudo).. ఈ విషయంలో ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. తాజాగా ఆయన యూనిటెడ్ అరబ్ ఎమిరెట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్(Shaik Mahomoodbin Jayed)తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇదే అంశాన్ని లేవనెత్తారు. భారత్ - కెనడా(India - Canada)ల మధ్య దౌత్యపర వివాదానికి దారి తీయడంతో అరబ్ కంట్రీ మద్దతు తమకే ఉండాలని ఆయన కోరినట్లు సమాచారం. తమకు మద్దతిస్తే చట్టబద్ధమైన పాలనను సమర్థించడం, గౌరవించినట్లు అవుతుందని ఆ దేశ అధ్యక్షుడితో వ్యాఖ్యానించారు. దీంతో పాటు ఇజ్రాయెల్ - హమాస్ వివాదాన్ని సైతం ట్రూడో ప్రస్తావించారు. 'యూఏఈ(UAE) అధ్యక్షుడితో ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడాం. ఇజ్రాయెల్ - హమాస్(Israel - Hamas) మధ్య పరిస్థితులపై చర్చించాం. భారత్ తమకు మధ్య వివాదం కూడా చర్చకు వచ్చింది' అని ట్రూడో ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని సొంత గడ్డపైనే భారత్(India) హత్య చేయించిందని ట్రూడో ఆ దేశ పార్లమెంట్ లో ఆరోపించారు. ఈ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. వీటిని ఖండించిన భారత్ తామే హత్య చేయించామనడానికి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేసింది. ఈ ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారింది. భారత్ లో కెనడా తన దౌత్య వేత్తలను తిరిగి పిలిపించుకోవడం.. భారత్ ఆ దేశానికి వీసాలు నిలిపేయడంతో దౌత్య పరమైన వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే కెనడా అంతర్జాతీయ సమాజం మద్దతును కోరుకుంటోంది.
Updated Date - 2023-10-09T07:42:51+05:30 IST