ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indonesia : రాజధానిని మార్చుతున్న ఇండోనేషియా... కారణాలివే...

ABN, First Publish Date - 2023-03-10T15:13:28+05:30

ఇండోనేషియా (Indonesia) రాజధానిని జకార్తా (Jakarta) నుంచి బోర్నియో (Borneo) ద్వీపానికి మార్చుతున్నారు. జకార్తా నగరం

Indonesia
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : ఇండోనేషియా (Indonesia) రాజధానిని జకార్తా (Jakarta) నుంచి బోర్నియో (Borneo) ద్వీపానికి మార్చుతున్నారు. జకార్తా నగరం జనసంద్రంగా మారడం, కాలుష్యంతో నిండిపోవడం, భూకంపాల ముప్పు ఉండటం, జావా సముద్రంలోకి వేగంగా మునిగిపోయే అవకాశం వంటివాటి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. బోర్నియో సుస్థిరమైన అటవీ నగరంగా ఉంటుందని, అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణకే పెద్ద పీట వేస్తామని, 2045 నాటికి కార్బన్ న్యూట్రల్ సిటీగా తీర్చిదిద్దుతామని ఇండోనేషియా అధికారులు చెప్తున్నారు.

అయితే పర్యావరణవేత్తలు ప్రభుత్వ అధికారుల మాటలను విశ్వసించడం లేదు. బోర్నియోలో రాజధాని నగరాన్ని నిర్మించడం వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల నరికివేత, అనేక రకాల జీవుల నివాస స్థానాలు దెబ్బతినడం, స్థానిక ప్రజల జీవనోపాధికి విఘాతం కలగడం వంటి దారుణాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు.

జకార్తా నగరంలో దాదాపు కోటి మంది నివసిస్తున్నారు. ఈ నగరంలోని మూడో వంతు 2050నాటికి సముద్రంలో మునిగిపోతుందని అంచనా. భూగర్భ జలాలను విపరీతంగా తోడేయడం, వాతావరణ మార్పుల వల్ల జావా సముద్రం పెరగడం దీనికి కారణాలని చెప్తున్నారు. ఈ నగరంలోని గాలి, భూగర్భ జలాలు కూడా కలుషితమైపోయాయి. తరచూ వరదలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో (Joko Widodo) రాజధాని నగరాన్ని మార్చాలని నిర్ణయించారు. నుసంటారా పేరుతో సుస్థిరమైన నగరాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ప్రభుత్వ భవనాలు, కొన్ని ఇళ్లను ఇక్కడ నిర్మించి, సుమారు 15 లక్షల మంది ప్రభుత్వోద్యోగులను ఇక్కడికి తరలిస్తారు.

ఇవి కూడా చదవండి :

Women's Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి తెలుసుకుంటే అవాక్కవుతారు

British Royal Family: బ్రిటిష్ రాజ వంశంలో కూడా ఇంత చీప్‌గా ఆలోచిస్తారా..!

Updated Date - 2023-03-10T15:13:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising