ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Elon Musk:గాజాకు ఇంటర్నెట్ పునరుద్ధరించవద్దు.. ఎలాన్ మస్క్‌ని హెచ్చరించిన ఇజ్రాయెల్

ABN, First Publish Date - 2023-10-29T14:59:48+05:30

గాజా(Gaza)కు ఇంటర్నెట్ కనెక్టివిటీ తెగిపోవడంతో ఆ ప్రాంత ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. ఇలాంటి టైంలో ఇజ్రాయెల్ స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk)కి వార్నింగ్ ఇచ్చింది. గాజాకు స్పేస్ ఎక్స్ శాటిలైట్ ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించకూడదని.. లేదంటే స్టార్ లింక్(Star Link)తో ఇజ్రాయెల్ ప్రభుత్వం సంబంధాలు తెంచుకుంటుందని హెచ్చరించింది.

జెరూసలెం: గాజా(Gaza)కు ఇంటర్నెట్ కనెక్టివిటీ తెగిపోవడంతో ఆ ప్రాంత ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. ఇలాంటి టైంలో ఇజ్రాయెల్ స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk)కి వార్నింగ్ ఇచ్చింది. గాజాకు స్పేస్ ఎక్స్ శాటిలైట్ ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించకూడదని.. లేదంటే స్టార్ లింక్(Star Link)తో ఇజ్రాయెల్ ప్రభుత్వం సంబంధాలు తెంచుకుంటుందని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన కామెంట్స్ ఇప్పుడు ఎక్స్(X)లో హాట్ టాపిక్ అయ్యాయి. కమ్యూనికేషన్ లింకులను ఉపయోగించుకుని హమాస్ మిలిటెంట్లు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడవచ్చని ఆ దేశ కమ్యూనికేషన్ శాఖ మంత్రి ష్లోమో కర్హి ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ గాజా కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీయడంతో దాదాపు 2.3 మిలియన్ల ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గాజాలో ఇప్పటికే పరిస్థితి దయనీయంగా మారిందని.. పరిస్థితి మరింత దిగజార్చకుండా కమ్యూనికేషన్ ని పునరుద్ధరించాలని అంతర్జాతీయ మానవతా సంస్థలు కోరుతున్నాయి. కమ్యూనికేషన్ కట్ అవడం మెడికల్ ఎమర్జెన్సీ నంబర్ 101పై ప్రభావం చూపుతుందని అన్నారు. తద్వారా వైమానిక దాడులలో గాయపడిన వారికి సహాయం చేయడానికి అంబులెన్స్‌ల రాక ఆలస్యానికి కారణమయ్యి క్షతగాత్రుల ప్రాణాలు పోయే ఛాన్స్ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇజ్రాయెల్ వార్నింగ్ పై ఎలాన్ మస్క్ స్పందించలేదు.

దిగజారుతున్న పరిస్థితులు..

గాజా పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. శుక్రవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(IDF) జరిపిన వైమానిక దాడుల్లో గాజా వ్యాప్తంగా ఉన్న కమ్యూనికేషన్‌ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్నాళ్లుగా కరెంటు లేక.. నీటికి కటకటలాడుతున్న గాజా(Gaza) వాసులకు ఇప్పుడు ఇంటర్నెట్‌ సదుపాయం నిలిచిపోయింది. సెల్‌ఫోన్లు, ల్యాండ్‌లైన్‌ ఫోన్లు మూగబోయాయి. ప్రపంచంతో గాజాకు సమాచార వ్యవస్థ కట్‌ అయింది. ‘‘గాజాలో శాటిలైట్‌ ఫోన్లు తప్ప.. ఎలాంటి కమ్యూనికేషన్‌ వ్యవస్థ లేదు. ప్రపంచంతో గాజాకు సమాచార సంబంధాలు కట్‌ అయ్యాయి’’ అని పాలస్తీనా టెలికాం కంపెనీ ‘జవ్వాల్‌’, వెస్ట్‌ఎండ్‌, గాజాలో అతిపెద్ద సెల్‌ ఆపరేటర్‌ ‘పాల్‌టెల్‌’ పేర్కొన్నట్లు సీఎన్‌ఎన్‌ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. మరోవైపు గాజాలోని కీలక నగరాలు తుడిచిపెట్టుకుపోయాయని, ఆకాశ హార్మ్యాలు నేలకూలాయని, అక్కడక్కడా మొండిగోడలే కనిపిస్తున్నాయని పేర్కొంటూ అమెరికాకు చెందిన మ్యాక్సర్‌ టెక్నాలజీస్‌ శనివారం పలు ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది.


గాజాలో గ్రౌండ్‌ వార్‌ను సూత్రప్రాయంగా ప్రారంభించిన ఐడీఎఫ్‌.. పూర్తిస్థాయిలో గాజాలోకి చొచ్చుకువెళ్లేందుకు అనుగుణంగా.. కమ్యూనికేషన్‌ వ్యవస్థపై దాడి చేసినట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం అర్ధరాత్రి 250 టార్గెట్లపై దాడులు చేసినట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది. ఈ దాడుల్లో హమాస్‌ ఎయిర్‌ చీఫ్‌ ఇసాం అబూ రుక్బే హతమైనట్లు తెలిపింది. హమా్‌సకు చెందిన 150 సొరంగాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్‌-షిఫాలో హమాస్‌ కీలక స్థావరం ఉన్నట్లు ఐడీఎఫ్‌ చెప్పింది. అందుకు సంబంధించిన ఆధారాలను మీడియాకు ఇచ్చింది. ఇజ్రాయెల్‌ను దీటుగా ఎదుర్కొంటామని హమాస్‌ ప్రకటించింది. తామూ సిద్ధమని అల్‌-ఖాసమ్‌ బ్రిగేడ్‌, పాలస్తీనా రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌ ప్రకటించాయి. మరోవైపు హమాస్‌ కీలక నేత గాజీ అహ్మద్‌ శనివారం ‘అరబిక్‌ టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఈనెల 7 నాటి దాడిపై మాట్లాడారు. ఇజ్రాయెల్‌లో పౌరులు తమ టార్గెట్‌ కాదని.. కేవలం ఇజ్రాయెల్‌ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోవాలనుకున్నామని చెప్పారు. ఇజ్రాయెల్‌ సైనికులను మాత్రమే కిడ్నాప్‌ చేయాలనుకున్నట్లు తెలిపారు. ఈ దాడితో తాము పాలస్తీనా అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చామని వ్యాఖ్యానించారు. కాగా, ఇజ్రాయెల్‌ తన చెరలోని ఖైదీలందరినీ వదిలిపెడితే, తమ వద్ద ఉన్న బందీలను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని హమాస్‌ సాయుధ దళం ప్రకటించింది. హమాస్‌ ఇలాంటి షరతులు విధించడం ఇదే తొలిసారి కాదు. ఇజ్రాయెల్‌ జైళ్లలో ప్రస్తుతం 10వేల మంది పాలస్తీనియన్లు ఉన్నట్లు అంచనా.

Updated Date - 2023-10-29T15:02:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising