ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israeli vs Hamas War: కాల్పులను ఆపేదేలేదు.. అలా చేస్తే హమాస్‌కు లొంగిపోయినట్లే: నెతన్యాహు

ABN, First Publish Date - 2023-10-31T09:16:22+05:30

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ తీవ్రత రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. రెండు వైపుల నుంచి భీకర దాడులు కొనసాగుతుండడంతో యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. వెనక్కి తగ్గడానికి రెండు దేశాలు ఏ మాత్రం ఆసక్తి కనబర్చడం లేదు. కదనరంగంలో ముందుకే వెళ్తున్నాయ తప్ప వెనుకడుగు వేయడం లేదు.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ తీవ్రత రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. రెండు వైపుల నుంచి భీకర దాడులు కొనసాగుతుండడంతో యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. వెనక్కి తగ్గడానికి రెండు దేశాలు ఏ మాత్రం ఆసక్తి కనబర్చడం లేదు. కదనరంగంలో ముందుకే వెళ్తున్నాయ తప్ప వెనుకడుగు వేయడం లేదు. హమాస్ మిలిటెంట్లు ఉన్న గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులతో విరుచుపడుతోంది. ఇజ్రాయెల్‌లోని పలు నగరాలపై హమాస్ మిలిటెంట్లు రాకెట్ దాడులకు పాల్పడుతున్నారు. రెండువైపుల కొనసాగుతున్న ముమ్మర దాడులతో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. వేల మంది అమాయకులు యుద్ధానికి బలైపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు కాల్పులు విరమించాలని, యుద్ధాన్ని ఆపాలని ప్రపంచదేశాలు, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. అయితే ప్రపంచదేశాల అభ్యర్థనలపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ కాల్పులు విరమించుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గాజాలో కొనసాగుతున్న దాడుల్ని ఆపబోమని తెలిపారు. దాడుల్ని ఆపితే హమాస్‌కు లొంగిపోయినట్లే అవుతుందని అన్నారు. కాబట్టి అలా ఎప్పటికీ జరగనివ్వబోమని తెలిపారు.


అయితే హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ వాసులను విడిపించేందుకు తమకు ప్రపంచ దేశాలు సాయం చేయాలని నెతన్యాహు కోరారు. తమ చెరలో బందీలుగా ఉన్నవారిని హమాస్ వెంటనే విడుదల చేయాలని ప్రపంచదేశాలు డిమాండ్ చేయాలని ఆయన అభ్యర్థించారు. అంతకుముందు జరిగిన కేబినెట్ భేటీలో అక్టోబర్ 7న జరిగిన దాడులకు ప్రతిస్పందనగా గాజాపై దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యం క్రమపద్ధతిలో పురోగతి సాధిస్తోందని నెతన్యాహు తెలిపారు. గాజా స్ట్రిప్‌లో తమ సైన్యం మరింతగా విస్తరించిందని పేర్కొన్నారు. హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని క్షేమంగా తీసుకురావడానికి క‌ృషి చేస్తున్నట్టు నెతన్యాహు చెప్పారు. కాగా ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడికి ప్రతిస్పందనగా ఆ దేశ సైన్యం గాజాపై దాడి చేసింది. దీంతో 2.4 మిలియన్ల నివాసితులు ఉన్న గాజాలో ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో 8,300 మంది చనిపోయినట్లు హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు హమాస్ దాడుల్లో 1,400 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారని, 230 మందిని బందీలుగా తీసుకెళ్లారని నెతన్యాహు తెలిపారు.

Updated Date - 2023-10-31T09:16:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising