ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Prigozhin Death: ప్రిగోజిన్ మృతిపై జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు.. ఆశ్చర్యమేముందంటూ పెద్ద షాకిచ్చారుగా!

ABN, First Publish Date - 2023-08-24T15:29:13+05:30

వాగ్నర్ మెర్సెనరీ గ్రూప్ అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్ ఓ విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాబు ప్రకటించిన ఆయన.. ఇప్పుడు ఇలా ప్రమాదంలో...

వాగ్నర్ మెర్సెనరీ గ్రూప్ అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్ ఓ విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాబు ప్రకటించిన ఆయన.. ఇప్పుడు ఇలా ప్రమాదంలో మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రిగోజిన్ మరణంపై ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక కచ్ఛితంగా కుట్ర ఉండొచ్చని చాలామంది తమ అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నారు. ఇది యాధృచ్చికంగా జరిగిన సంఘటన అయితే కాదంటూ వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం ప్రిగోజిన్ మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న వాస్తవాల గురించి తనకు తెలియదన్న ఆయన.. దీనిపై తానేమీ ఆశ్చర్యపోలేదని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. పుతిన్ హస్తం లేనిదే రష్యాలో ఏం జరగదని పేర్కొంటూ.. ఈ ఘటన వెనుక పుతిన్ హస్తం తప్పకుండా ఉండొచ్చని నర్మగర్భంగా మాట్లాడారు. ఈ ఘటనపై తనకు మరింత సమాచారం తెలియదు కాబట్టి, ఇంతకన్నా తానేమీ మాట్లాడలేనని చెప్పుకొచ్చారు. గతంలోనూ.. ప్రిగోజిన్‌పై విషప్రయోగం జరగొచ్చనేలా బైడెన్ వ్యాఖ్యానించారు.


ఇదిలావుండగా.. ప్రిగోజిన్ మొదట్లో చిల్లర దొంగతనాలు చేసేవాడు. 1980వ దశకంలో ఆయనపై ఎన్నో దొంగతనం కేసులు నమోదయ్యాయి. కొంతకాలం జైలు జీవితం గడిపిన ఆయన.. 1990లో విడుదలయ్యాక సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. ఆపై సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లను ఏర్పాటు చేశారు. రెస్టారెంట్ల నెట్‌వర్క్‌ను ప్రారంభించి భారీ మొత్తంలో డబ్బు సంపాదించిన ఆయన.. 2014లో క్రిమియాపై రష్యా యుద్ధం చేసిన సమయంలో వాగ్నర్ గ్రూప్ కిరాయి సైన్యాన్ని ప్రారంభించారు. రష్యా సైన్యంతో కలిసి వాగ్నర్ గ్రూప్ దళాలు పోరాడాయి.

అయితే.. జూన్ నెలలో ప్రిగోజిన్ పుతిన్‌పై తిరుగుబాటు చేశారు. దీన్ని పుతిన్ దోశద్రోహ చర్యగా అభివర్ణించారు. కానీ.. కొంతకాలానికి ప్రిగోజిన్ వెనక్కు తగ్గారు. బెలారస్ మధ్యవర్తిత్వంతో ఈ తిరుగుబాటు వ్యవహారం సద్దుమణిగింది. పుతిన్‌తో ఒప్పందం కూడా జరగ్గా.. అందులో భాగంగా ఆయనపై కేసులు ఎత్తివేయడం జరిగింది. ఇప్పుడు ఆయన విమాన ప్రమాదంలో మృతి చెందడంతో.. పుతిన్ కుట్ర పన్ని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది.

Updated Date - 2023-08-24T15:29:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising