ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hardeep Singh Nijjar: సీసీటీవీ కెమెరాలో రికార్డైన నిజ్జర్ హత్య దృశ్యాలు.. 90 సెకన్ల నిడివి గల ఆ ఫుటేజీలో ఏముందంటే?

ABN, First Publish Date - 2023-09-26T18:05:54+05:30

ఓవైపు భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. మరోవైపు వాషింగ్టన్ పోస్టు సంచలన కథనం ప్రచురించింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన వీడియోని తాము చూశామని...

ఓవైపు భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. మరోవైపు వాషింగ్టన్ పోస్టు సంచలన కథనం ప్రచురించింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన వీడియోని తాము చూశామని పేర్కొంది. ఈ హత్య జరిగిన సమీపంలోనే సీసీటీవీ కెమెరా ఉందని, అందులో నిజ్జర్ హత్య దృశ్యాలు రికార్డ్ అయ్యాయని తెలిపింది. 90 సెకన్ల నిడివి గల ఈ ఫుటేజీలో.. నిజ్జర్‌ని నేరస్తులు వెంబడించడం, ఒక చోట అడ్డుకొని అతనిపై కాల్పులు జరపడం, అనంతరం అక్కడి నుంచి దుండగులు తాపీగా వెళ్లిపోవడం వంటి దృశ్యాలు రికార్డ్ అయ్యాయని వెల్లడించింది.

వాషింగ్టన్ పోస్టు కథనం ప్రకారం.. సర్రేలోని గురుద్వారా పార్కింగ్ స్థలంలో నిజ్జర్‌ వినియోగించే గ్రేకలర్‌ పికప్‌ ట్రక్‌, ఓ తెల్లటి సెడాన్‌ కారు పక్కపక్కనే సమాంతరంగా ప్రయాణిస్తున్నాయి. ఇంతలోనే సెడాన్ కారు వేగంగా ముందుకెళ్లి.. నిజ్జర్ ట్రక్‌ ఎదురుగా వచ్చి ఆగింది. అప్పుడు ముఖం కనిపించకుండా హుడెడ్ స్వెట్ షర్ట్‌లు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో నిజ్జర్ ట్రక్ వద్దకు వచ్చి.. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ట్రక్ సీట్‌లో ఉన్న డ్రైవర్‌పై తూటాల వర్షం కురిపించారు. మొత్తం 50 తూటాలు కాల్చగా.. వాటిలో 34 బుల్లెట్లు నిజ్జర్ శరీరంలోకి దూసుకెళ్లాయి. కాల్పులు జరిపిన అనంతరం సెడాన్ కారు వైపు దిశగా ఆ ఇద్దరు దుండగులు పరుగులు తీశారు. ఈ ఘటన జూన్ 18వ తేదీన రాత్రి 8.27 గంటల సమయంలో జరిగింది.


ఈ కాల్పుల శబ్దం విని.. సమీపంలోనే ఫుడ్‌బాల్ ఆడుతున్న గురుద్వారా వాలంటీర్ భూపిందర్‌జిత్ సింగ్ సంఘటనా స్థలానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కారు దగ్గరికి వెళ్లి అతడు చూడగా.. నిజ్జర్ అప్పటికే అచేతనంగా పడి ఉన్నాడు. కారు మొత్తం రక్తం ఏరులైపారుతుండగా.. నేల బుల్లెట్లతో నిండి ఉందని అతడు తెలిపాడు. ఈ సంఘటన గురించి తాను పోలీసులు సమాచారం ఇవ్వగా.. వెంటనే అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ కాల్పులకు సంబంధించిన తొలి రిపోర్ట్‌ని తాము 8:27 గంటలకు అందుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఈ కేసు దర్యాప్తుకు ఎవరు నాయకత్వం వహించాలన్న విషయంపై కెనడా రాయల్ మౌంటెడ్ పోలీసు, సర్రే హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ బృందం మధ్య కొద్దిసేపు వాదనలు జరిగినట్టు భూపిందర్ తెలిపాడు.

ఇదిలావుండగా.. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇరుదేశాలూ పరస్పర దౌత్యాధికారుల్ని బహిష్కరించాయి. అంతేకాదు.. కెనడా నుంచి వచ్చే వాళ్లకు భారత్ వీసా సేవల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. మరోవైపు.. ఖలిస్తానీ వేర్పాటువాదులు కెనడాలో పెట్రేగిపోతున్నారు. భారత దౌత్య కార్యాలయాల ముందు ఆందోళనలకు ‘సిక్స్ ఫర్ జస్టిస్’ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ భద్రత పెంచారు.

Updated Date - 2023-09-26T18:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising