Death sentences: 23మంది ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లకు మరణశిక్ష...లిబియా కోర్టు సంచలన తీర్పు
ABN, First Publish Date - 2023-05-30T11:03:01+05:30
ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన 23 మంది మిలిటెంట్లకు లిబియా కోర్టు మరణశిక్ష విధించింది.2015వ సంవత్సరంలో ఈజిప్టు దేశానికి చెందిన క్రైస్తవులను శిరచ్ఛేదం చేయడం, సిర్టే నగరాన్ని స్వాధీనం చేసుకోవడం వంటి ఘోరమైన ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ ప్రచారంలో పాత్ర పోషించినందుకు లిబియా కోర్టు 23 మందికి మరణశిక్ష,మరో 14 మందికి జీవిత ఖైదు విధించింది....
ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన 23 మంది మిలిటెంట్లకు లిబియా కోర్టు మరణశిక్ష విధించింది.2015వ సంవత్సరంలో ఈజిప్టు దేశానికి చెందిన క్రైస్తవులను శిరచ్ఛేదం చేయడం, సిర్టే నగరాన్ని స్వాధీనం చేసుకోవడం వంటి ఘోరమైన ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ ప్రచారంలో పాత్ర పోషించినందుకు లిబియా కోర్టు 23 మందికి మరణశిక్ష,మరో 14 మందికి జీవిత ఖైదు విధించింది.(Libya court sentences)మరో వ్యక్తికి 12 ఏళ్ల జైలు శిక్ష, ఆరుగురికి 10 ఏళ్లు, ఒకరికి ఐదేళ్లు, ఆరు నుంచి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.(Islamic State campaign) మరో ఐదుగురు నిర్దోషులుగా విడుదలయ్యారని, మరో ముగ్గురు తమ కేసు విచారణకు రాకముందే మరణించారని అటార్నీ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.(Libya court death sentences)2015లో అది ట్రిపోలీలోని విలాసవంతమైన కొరింథియా హోటల్‌పై దాడి చేసి, తొమ్మిది మందిని చంపారు.
Updated Date - 2023-05-30T11:08:54+05:30 IST