ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

King Charles-Egg: బ్రిటన్ రాజుపై గుడ్డు విసిరిన వ్యక్తికి జరిమానా..

ABN, First Publish Date - 2023-01-13T20:33:16+05:30

బ్రిటన్ రాజు వైపు కోడి గుడ్డు విసిరిన కేసులో ఓ నిందితుడికి స్థానిక కోర్టు 100 పౌండ్ల జరిమానా విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: బ్రిటన్ రాజు ఛార్ల్స్(King Charles) వైపు కోడి గుడ్డు విసిరిన(Egg thrown) కేసులో ఓ నిందితుడికి స్థానిక కోర్టు 100 పౌండ్ల జరిమానా విధించింది. పబ్లిక్ ఆర్డర్‌కు విఘాతం కలిగించినందుకు మరో 85 పౌండ్లు ఖర్చుల కింద చెల్లించాలంటూ తాజాగా తీర్పు వెలురించింది. గతేడాది డిసెంబర్ 6న కింగ్ ఛార్ల్స్ లండన్‌కు ఉత్తరాన ఉన్న ల్యూటన్(Luton) ప్రాంతంలో సిక్కు ప్రార్థనామందిరాన్ని ప్రారంభించేందుకు వెళ్లారు. తనను చూసేందుకు వచ్చిన వారితో ఆయన ముచ్చటిస్తున్న సమయంలో హారీ మే అనే యువకుడు రాజువైపుగా గుడ్డు విసిరాడు. అది ఆయనకు తగలకుండా సమీపంలో పడింది. కాగా.. బీద ప్రాంతమైన ల్యూటన్‌లో రాజు ఠీవీగా పర్యటించడం సరైన చర్య కాదని పోలీసులకు నిందితుడు చెప్పుకొచ్చాడు.

రాజును గుడ్డుతో కొట్టాలనుకోలేదని, కేవలం నిరసన తెలిపేందుకే ఆయన వైపుగా గుడ్డు విసిరానని తెలిపాడు. అయితే.. చేతిలో ఉన్నది అవతలివారిపై విసరడం అభిప్రాయబేధాలను పరిష్కరించదని న్యాయమూర్తి నిందితుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతకుమునుపు కూడా బ్రిటన్ రాజుపైపుగా గుడ్డు విసిరిన మరో వ్యక్తి.. బహిరంగ ప్రదేశాల్లో గుడ్డు వెంట తీసుకెళ్లకూడదంటూ కోర్టు శిక్ష విధించింది. ఈ తీర్పుతో తనకు పచారీ సామాన్ల కొనుగోలులో ఇబ్బంది ఎదురవుతోందని అతడు మీడియా ముందు వాపోయాడు. ఛార్ల్స్ రాజైన అనంతరం బ్రిటన్‌ రాజరిక వ్యవస్థపై అక్కడ నిరసనలు తరచూ వెలుగుచూస్తున్నాయి.

Updated Date - 2023-01-14T00:00:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising