ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Luna-25: చంద్రునిపై కుప్పకూలిన లూనా-25 ప్రదేశాన్ని కనుగొన్న నాసా.. ఇవిగో ఫోటోలు

ABN, First Publish Date - 2023-09-01T17:47:05+05:30

దాదాపు 47 సంవత్సరాల తర్వాత రష్యా చేపట్టిన లూనా-25 మూన్ మిషన్ విఫలమైన సంగతి తెలిసిందే! చంద్రయాన్-3 కన్నా ముందు చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలు మోపి చరిత్ర సృష్టించాలన్న ఉద్దేశంతో..

దాదాపు 47 సంవత్సరాల తర్వాత రష్యా చేపట్టిన లూనా-25 మూన్ మిషన్ విఫలమైన సంగతి తెలిసిందే! చంద్రయాన్-3 కన్నా ముందు చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలు మోపి చరిత్ర సృష్టించాలన్న ఉద్దేశంతో రష్యా ఈ మిషన్‌ని చేపట్టింది. కానీ.. దురదృష్టవశాత్తూ ఇది ఫెయిల్ అయ్యింది. చంద్రుని కక్ష్యలోకి చేరగానే.. రష్యాతో లూనా-25 సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత అది చంద్రునిపై కుప్పకూలడం జరిగింది. తాజాగా ఆ కూలిన ప్రదేశాన్ని నాసాకు చెందిన లూనార్ రికనేసెన్స్ ఆర్బిటర్ (LRO) గుర్తించింది.


ఇంతకుముందు 2022 జూన్‌లో అదే ప్రదేశంలో నాసా ఆర్బిటర్ తీసిన ఫోటోతో పోలిస్తే.. ఇప్పుడు అక్కడ బిలం (గుంత) చాలా పెద్దదిగా ఉంది. దాదాపు 10 మీటర్ల వెడల్పు గుంత ఏర్పడినట్టు ఆర్టిటల్ తేల్చింది. ఫలితంగా.. లూనా-25 క్రాష్ అవ్వడం వల్లే ఈ బిలం ఏర్పడినట్లు నాసా ఆర్బిటర్ నిర్ధారించింది. తమ లూనా-25 మూన్ మిషన్ క్రాష్ అయిన సంగతిని రష్యా వెల్లడించిన తర్వాత.. LRO కెమెరా టీమ్, LRO మిషన్ ఆపరేషన్స్ టీమ్ వెంటనే LRO అంతరిక్ష నౌకకు కూలిన ఆ ప్రదేశపు ఫోటోలను బంధించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాయి. గతంలో తీసిన ఫోటోలతో ఈ తాజా ఫోటోలను పోల్చి చూడగా.. ఒక పెద్ద గుంతను కనుగొన్నారు. ఇది 10 మీటర్ల వెడల్పు ఉండటంతో.. లూనా-25 క్రాష్ కూలింది అక్కడేనని తేల్చారు.

మరోవైపు.. లూనా-25 క్రాష్ అవ్వడానికి గల కారణాలేంటో తెలుసుకోవడం కోసం రష్యాకు చెందిన రాస్‌కామోస్ అనే అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇంటర్-డిపార్ట్‌మెంటల్ కమిషన్’ని ఏర్పాటు చేసింది. ప్రాథమిక విచారణలో భాగంగా.. నిర్దేశిత స‌మ‌యంలో ఇంజిన్లు ఆఫ్ కాకపోవడం వల్లే లూనా-25 క్రాష్ అయినట్లు ఆ సంస్థ వెల్లడించింది. తాము అనుకున్నట్టు ఇంజిన్ 84 సెక్ల‌న‌లో ఆఫ్ కావాల‌ని, కానీ ఆ ప్ర‌క్రియ జ‌రిగేందుకు 127 సెకన్లు ప‌ట్టింద‌ని, ఫలితంగా అది నియంత్రణ కోల్పోయి కూలిందని ఆ ఏజెన్సీ డైరెక్టర్ యూరి బోరిసోవ్ తెలిపారు. ఈ మిష‌న్‌లో జ‌రిగిన పొర‌పాట్ల‌ను తాము తీసుకుంటామని.. భవిష్యత్తులో లూనా-26, 27, 28 మిష‌న్లు తప్పకుండా స‌క్సెస్ అవుతాయ‌ని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-01T17:48:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising