ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NASA: ఆకాశంలో అద్భుతం.. వజ్రంలా మెరుస్తున్న గ్రహం.. నాసా షేర్ చేసిన ఫోటో

ABN, First Publish Date - 2023-09-12T17:56:48+05:30

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తరచుగా అంతరిక్షంలోని అద్భుతాలను తన కెమెరాలో బంధించి.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా...

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తరచుగా అంతరిక్షంలోని అద్భుతాలను తన కెమెరాలో బంధించి.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా మన సౌర కుటుంబంలోని అతి చిన్న గ్రహం అయిన బుధుడికి (Mercury) సంబంధించి ఒక స్టన్నింగ్ ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటో చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉందంటే.. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. నీలి రంగు షేడ్స్‌తో పాటు యెల్లోయిష్-బ్రౌన్ కలర్లతో.. ఒక వజ్రం మెరిసినట్టు ఈ ఫోటోలు బుధుడు కనిపిస్తున్నాడు. ఈ గ్రహం ఉపరితలంపై క్రేటర్స్ (గుంతలు) కూడా మనం గమనించవచ్చు. ఈ ఫోటోని మెసెంజర్ అనే అంతరిక్ష నౌక బంధించింది. బుధుడు ఉపరితలంపై ఉన్న రాళ్లల్లో రసాయన, ఖనిజ, భౌతిక వ్యత్యాసాల్ని గుర్తించేందుకు ఇలా రంగుల మయమైన ఫోటోని మెసెంజర్ క్యాప్చర్ చేసింది. బుధుడి భూగర్భ శాస్త్రం, అయస్కాంత క్షేత్రం, రసాయన కూర్పును అధ్యయనం చేయడమే ఈ మెసెంజర్ లక్ష్యం.


ఈ ఫోటోని నాసా సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది. ‘‘బుధుడు గ్రహాన్ని మిస్టర్ ఫారన్‌హీట్ అని పిలుస్తారు. సైజులో చంద్రుని కంటే కొంచెం పెద్దగా ఉండే ఈ గ్రహం.. మన సౌర కుటుంబంలోనే అత్యంత చిన్నది. ఇది సూర్యునికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రహం చిన్నదే అయినప్పటికీ తన ఆర్బిట్ చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతుంది. సెకనుకి 47 కిలోమీటర్ల వేగంతో ఇది చక్కర్లు కొడుతుంది. ఈ గ్రహంపై ఒక సంవత్సర కాలం.. భూమికి 88 రోజులతో సమానం. బుద్ధుడి కలర్‌ఫుల్ ఫోటోని మెసెంజర్ అనే స్పేస్‌క్రాఫ్ట్ తీసింది. ఈ గ్రహం చాలావరకు ఆక్సిజన్, సోడియం, హైడ్రోజన్, హీలియం, పొటాషియంతో కూడిన సన్నని ఎక్సోస్పియర్‌ను కలిగి ఉంటుంది. వాతావరణం లేకపోవడం, సూర్యునికి దగ్గరగా ఉండటంతో.. పగటిపూట పగటిపూట 800ºF (430ºC) నుండి రాత్రికి -290 ºF (-180 ºC) వరకు ఉష్ణోగ్రతలో మార్పులు చోటు చేసుకుంటాయి. భూమితో పోలిస్తే దీని అయస్కాంత క్షేత్రం చాలా బలహీనమైనది’’ అని నాసా పేర్కొంది.

కాగా.. నాసా ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, దీనికి నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటిదాకా ఈ ఫోటోకు 11 లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయి. ఒక యూజర్ ఈ ఫోటో కింద కామెంట్ చేస్తూ.. ‘‘నేను ఆకాశంలో మండుతున్న అగ్నిగోళాన్ని. 200 వందల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంటుంది. నన్ను మిస్టర్ మెర్క్యూరీ అని పిలుస్తారు’’ అంటూ రాసుకొచ్చారు. ఇది చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉందని, వజ్రంలా మెరుస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - 2023-09-12T17:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising