New Zealand: ప్రధాని జసిండా ఆర్డెర్న్ సంచలన నిర్ణయం
ABN, First Publish Date - 2023-01-19T08:06:36+05:30
న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు....
సిడ్నీ(న్యూజిలాండ్): న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.(New Zealand) వచ్చే నెలలో తాను ప్రధాని పదవికి రాజీనామా(Step Down next month) చేయనున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్(PM Jacinda Ardern) గురువారం ప్రకటించారు. ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో న్యూజిలాండ్ లేబర్ పార్టీ గెలుస్తుందని తాను ఇప్పటికీ నమ్ముతున్నానని న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్ అన్నారు.2017 వ సంవత్సరంలో సంకీర్ణ ప్రభుత్వంలో జసిండా ప్రధానమంత్రి అయ్యారు. తదుపరి సార్వత్రిక ఎన్నికలు(General Election) అక్టోబర్ 14వతేదీ శనివారం జరుగుతాయని, అప్పటి వరకు తాను ఎంపీగా కొనసాగుతానని ఆర్డెర్న్ చెప్పారు.తన రాజీనామా వెనుక ఎలాంటి రహస్యం లేదని ఆర్డెర్న్ స్పష్టం చేశారు.
Updated Date - 2023-01-19T08:06:38+05:30 IST