ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nikki Haley: గాజా పౌరుల కోసం ఎందుకు ద్వారాలు తెరవడం లేదు.. అరబ్ దేశాలపై నిక్కీ హేలీ ధ్వజం

ABN, First Publish Date - 2023-10-16T17:10:00+05:30

అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి బరిలో ఉన్న నిక్కీ హేలీ తాజాగా అరబ్ దేశాలపై ధ్వజమెత్తారు. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో గాజా పౌరులు తమ ఇళ్లు విడిచి...

అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి బరిలో ఉన్న నిక్కీ హేలీ తాజాగా అరబ్ దేశాలపై ధ్వజమెత్తారు. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో గాజా పౌరులు తమ ఇళ్లు విడిచి వెళ్లిపోవాలని చూస్తున్నారని, వారి కోసం అరబ్ దేశాలు ఎందుకు తమ ద్వారాలు తెరవడం లేదని మండిపడ్డారు. ఇరాన్ శక్తివంతంగా మారి.. హమాస్, హిజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలను బలోపేతం చేస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒమాబా, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్‌తో అణు ఒప్పందం విషయంలోపై తప్పుపట్టారు.

ఒక ఇంటర్వ్యూలో నిక్కీ హేలీ మాట్లాడుతూ.. ఇప్పుడు మనమంతా పాలస్తీనా పౌరుల గురించి మనం పట్టించుకోవాలని అన్నారు. అక్కడి అమాయక ప్రజలు ఇలాంటి పరిస్థితులు రావాలని కోరుకోరన్న ఆమె.. అరబ్ దేశాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఖతార్, లెబనాన్, జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు ఏమయ్యాయని నిలదీశారు. తాము ఈజిప్ట్‌కు సంవత్సరానికి బిలియన్ డాలర్లు ఇస్తున్నామని గుర్తు చేసిన ఆమె.. గాజా పౌరుల కోసం ఈ అరబ్ దేశాలు ఎందుకు తమ ద్వారాలు తెరవడం లేదని, పాలస్తీనియన్లను వాళ్లు ఎందుకు తీసుకెళ్లడం లేదని అడిగారు. శరణార్థుల చాటున హమాస్ బలగాలు కూడా తమ దేశాల్లో ప్రవేశిస్తాయనే భయంతోనే.. అరబ్ దేశాలు గాజా పౌరులకు ఆశ్రయం ఇవ్వడం లేదని ఆరోపించారు.


అరబ్ దేశాలే హమాస్‌ని చూసి భయపడుతున్నప్పుడు, ఇజ్రాయెల్ ఎందుకు తమ పొరుగున వాళ్లు ఉండాలని కోరుకుంటారని నిక్కీ హేలీ చెప్పారు. ఎవరు మంచోళ్లు, ఎవరు చెడ్డవాళ్లు అనేది ఈ అరబ్ దేశాలకు తెలీదు కాబట్టే పాలస్తీనా ప్రజలకు సహాయం చేయడం లేదని ఆరోపణలు చేశారు. అలాంటి ఇస్లామిక్ దేశాలు మాత్రం అమెరికాని నిందిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి.. ఈ యుద్ధాన్ని ఆపే సామర్థ్యం ఆ అరబ్ దేశాలకు ఉందని అభిప్రాయపడ్డారు. ఈ దాడుల్ని ఆపేసి, బందీలను విడిచిపెట్టమని హమాస్‌కు చెప్పే బలం ఆ దేశాలకు ఉందన్నారు. కానీ.. ఆ అరబ్ దేశాలు ఆ పని చేయకుండా కేవలం అమెరికా, ఇజ్రాయెల్‌ని నిందించడమే పనిగా పెట్టుకున్నాయని నిక్కీ హేలీ మండిపడ్డారు.

హమాస్‌తో, వారి నాయకత్వంతో కలిసి ఖతార్ పని చేయబోతోందని.. హమాస్‌కు ఇరాన్ నిధులు ఇవ్వడం ఆపదని నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు. గాజా పౌరులు ఆ ప్రాంతం విడిచి వెళ్లకుండా ఉండేందుకు హమాస్ చేయగలిగిందంతా చేయబోతోందని, ఎందుకంటే వాళ్లందరూ చనిపోవాలని హమాస్ కోరుకుంటోందని అన్నారు. గాజా పౌరుల్ని తమ కవచంలా వినియోగించుకోవాలని హమాస్ ఉగ్రవాదులు చూస్తున్నారన్నారు. పసికందుల్ని చంపడం, మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం వంటి క్రూర పనులు హమాస్ చేసిందని.. అలాంటి హమాస్‌కు ఇరాన్ సహాయం చేయడం చాలా దారుణమని అభిప్రాయపడ్డారు. తాము గతంలో ఇరాన్‌పై ఆంక్షలు విధిస్తే.. బైడెన్ వాటిని సడలించారని ఆమె చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-10-16T17:10:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising