ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan: ఓ పక్క ఆకలితో అలమటించిపోతుంటే.. పాకిస్థాన్ చేసిన పని ఇదీ!

ABN, First Publish Date - 2023-01-23T19:24:13+05:30

పాకిస్థాన్‌లో ఎక్కడ చూసినా జనం ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరాచీ: పాకిస్థాన్‌లో ఎక్కడ చూసినా జనం ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌( Pakistan)లో ప్రజల జీవనం రోజురోజుకు దుర్భరంగా మారుతోంది. ఇటీవల గోధుమ పిండితో వెళ్తున్న లారీని బైకులపై వెంబడించిన వేలాదిమంది ప్రాణాలకు తెగించి మరీ గోధుమ పిండిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గ్యాస్ సరఫరా లేకపోడంతో ప్రజలు మళ్లీ కట్టెలకు మారారు. కొందరు గ్యాస్‌ను ప్రమాదకరంగా ప్లాస్టిక్ సంచుల్లో నిల్వచేసుకుంటున్నారు.

ఓ వైపు పరిస్థితి ఇలా మరోవైపు, విలాసవంతమైన కార్లు(Luxery Cars), హై ఎండ్ ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి విడిభాగాలను దిగుమతి చేసుకునేందుకు దేశం ఏకంగా 1.2 బిలియన్ డాలర్లు (రూ.259 బిలియన్లు) ఖర్చు చేసింది. తిండి లేక అల్లాడిపోతున్న వేళ కార్ల దిగుమతి ఏంటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

పాకిస్థాన్‌లో విదేశీ మారక నిల్వలు 4 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయి. ఫలితంగా నిత్యావసరాలను దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం నానా కష్టాలు పడుతోంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో దేశ ప్రజలు ఇలా బిలియన్ల రూపాయలను లగ్జరీ కార్ల కోసం వెచ్చించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఆరు నెలల కాలంలో పాకిస్థాన్ 530.5 మిలియన్ డాలర్లు (రూ. 118.2 బిలియన్) విలువైన ‘కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్’ (CBU), ‘కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్’/‘సెమీ నాక్‌డ్ డౌన్’(CKD/SKD)లను దిగుమతి చేసుకుంది. సీకేడీ కిట్లను దిగుమతి చేసుకునేందుకు అనుమతి లేకపోవడంతో వాటి కిట్లను దిగమతి చేసుకుంటోంది. ఫలితంగా స్థానిక పరిశ్రమలు దారుణంగా దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం ఇటీవల లగ్జరీ కార్ల దిగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఫలితంగా దేశం నుంచి డాలర్ల ప్రవాహం కొనసాగింది.

Updated Date - 2023-01-23T19:24:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising