ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India vs Pakistan: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తరహాలో కశ్మీర్‌పై పాకిస్తాన్ ఎటాక్.. ఆ మౌలానా స్టేట్‌మెంట్ వెనుక పెద్ద ట్విస్ట్

ABN, First Publish Date - 2023-10-09T19:06:39+05:30

ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. శనివారం ఉదయం హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) 5 వేల రాకెట్లను ప్రయోగించి, ఈ యుద్ధానికి శంఖం..

ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. శనివారం ఉదయం హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) 5 వేల రాకెట్లను ప్రయోగించి, ఈ యుద్ధానికి శంఖం పూరించింది. భూ, జల, వాయు మార్గాల ద్వారా ఇజ్రాయెల్‌లోకి చొరబడి ఆ దేశ సైన్యానికి ఊహించని ఝలక్ ఇచ్చింది. ఇజ్రాయెల్ వెంటనే ఆ షాక్ నుంచి తేరుకొని, హమాస్‌పై యుద్ధం ప్రకటించి ఎదురుదాడులకు దిగింది. హమాస్ అధీనంలోని గాజాని ఆక్రమించేందుకు పెద్ద ప్లాన్ కూడా వేసింది.

ఈ యుద్ధంపై ప్రపంచ దేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని దేశాలు హమాస్ దాడిని సమర్థిస్తే, మరికొన్ని దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపాయి. పాకిస్తాన్ కూడా ఈ దాడిపై రియాక్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే పాక్‌కు చెందిన ఖలీద్ మహ్మద్ అబ్బాసీ అనే మౌలానా ఒక సంచలన ప్రకటన చేసినట్టు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఏ విధంగా ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిందో, అదే విధంగా భారత్‌పై కూడా పాకిస్తాన్ ఎటాక్ చేస్తుందని ఆయన వార్నింగ్ ఇచ్చాడన్నదే ఆ వార్త సారాంశం. గతంలోనూ ఆయన భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలోనూ భారత్‌కి వార్నింగ్ ఇచ్చినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్వయంగా ఆయనే స్పందించారు.


భారత్‌కు ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు చక్కర్లు కొడుతున్న ఒక స్క్రీన్ షాట్‌ని ఖలీద్ మహ్మద్ ట్విటర్ (X ప్లాట్‌ఫామ్)లో షేర్ చేస్తూ.. ‘భారతీయ రచనల్ని చూడండి’ అంటూ బదులిచ్చారు. అంటే.. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన పరోక్షంగా స్పష్టం చేసినట్టు అయ్యింది. ఇదే సమయంలో.. కొందరు భారతీయ నెటిజన్లు చేసిన కామెంట్లకు సైతం ఆయన బదులిచ్చాడు. ‘నువ్వు నిజంగానే ఈ వార్నింగ్ ఇచ్చి ఉంటే నిన్ను స్వర్గంలోని 72 వర్జిన్ మహిళల వద్దకు పంపుతాం’ అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. అందుకు ఆయన బదులిస్తూ.. ‘‘మీరు ఏ హిందుత్వ రాక్షసుడ్ని నిలబట్టారో, అతడే మిమ్మల్ని మింగేస్తాడు’ అంటూ చెప్పారు. అంటే.. ఆయన పరోక్షంగా ప్రధాని మోదీపై ఆ విమర్శలు గుప్పించారు.

మరో యూజర్ కూడా ‘అలాంటి ఆలోచన చేస్తే, ఉగ్రవాదులే లేకుండా నాశనం చేస్తామని’ కామెంట్ చేశాడు. అందుకు మౌలానా బదులిస్తూ.. ‘‘మేమేమీ చేయాల్సిన అవసరం లేదు, మీ వినాశనానికి మోదీనే చాలు. కానీ మీరే అర్థం చేసుకోవడం లేదు’’ అని చెప్పుకొచ్చారు. బహుశా ఆ వార్నింగ్ ప్రకటన మౌలానా ఇవ్వకపోయి ఉండొచ్చు కానీ.. యూజర్లుకు ఇచ్చిన సమాధానాల్ని బట్టి చూస్తే, ఆయనకు భారత్‌పై నరనరాల్లోనూ ద్వేషం ఉన్నట్టు స్పష్టమవుతోంది. అయినా.. ఎంత విషం కక్కినా భారత్‌ని పాకిస్తాన్ ఏం చేయలేదు. ఎందుకంటే.. భారత్‌తో పెట్టుకుంటే వాళ్ల పరిస్థితి ఏమవుతుందో వాళ్లకు బాగా తెలుసు. ఏదో పైపెచ్చు విషం కక్కుతారు కానీ, భారత్ జోలికి వచ్చే సాహసం చేయలేరు.

ఇంతకీ ఇజ్రాయెల్-మహాస్ యుద్ధంపై మౌలానా ఏం చెప్పారు?

చరిత్ర కనికరం లేకుండా మరోసారి పునరావృతం అవుతోంది. పాలస్తీనా భూమి ఆక్రమించబడింది. రెండు వేల సంవత్సరాల క్రితం కూడా పాంపే పెద్ద సైన్యంతో దండెత్తినప్పుడు పాలస్తీనా ఆక్రమణకు గురైంది. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్లు పాలస్తీనాని ఆక్రమించి, పాలస్తీనియన్లను బానిసలుగా చేసిందని అన్నారు. చరిత్ర నుంచి మొదలు ఇప్పటివరకూ ఈ ఘర్షణలో కొన్ని లక్షల మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన స్టేట్‌మెంట్‌ని బట్టి.. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని సమర్థిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2023-10-09T19:06:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising