ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nobel Prize: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

ABN, First Publish Date - 2023-10-03T16:27:39+05:30

భౌతిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారంనాడు ప్రకటించింది. ఈ ఏడాది ముగ్గురిని ఈ అవార్డు వరించింది. అమెరికాకు చెందిన ఫెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్‌ కు ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు.

స్టాక్‌హోమ్: భౌతిక శాస్త్రం (Physics)లో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాన్ని (Nobel prize) రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారంనాడు ప్రకటించింది. ఈ ఏడాది ముగ్గురిని ఈ అవార్డు వరించింది. అమెరికాకు చెందిన ఫెర్రీ అగోస్తిని (pierre Agostini), జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్ (Fernc Krausz), స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్‌ (Anne L'Huillier)కు ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు.


అణువుల్లో ఎలక్ట్రాన్ డైనమిక్స్‌ను అధ్యయనం చేయడం, కాంతి తరంగాల ఆటోసెకెండ్‌ పల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలకు గాను వీరిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ జనరల్ హన్స్ ఎలెగ్రెన్ తెలిపారు. ఈ అవార్డు కింద 11 మిలియన్ల స్వీడిష్ క్రోనార్‌లు అందజేయనున్నారు. వైద్యశాస్త్రంలో ఇద్దరికి సోమవారంనాడు నోబెల్ బహుమతి ప్రకటించగా, ఈ బుధవారం రసాయనశాస్త్రంలో, గురువారం సాహిత్య విభాగంలో, శుక్రవారంనాడు 2023 నోబెల్ శాంతి పురస్కారం విజేతలను ప్రకటిస్తారు. డిసెంబర్ 10న అవార్డుల ప్రదానం జరుగుతుంది. 1896లో కన్నమూసిన ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరుతో1901లో నోబెల్ పురస్కారాలను ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-10-03T16:27:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising