ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRICS Summit: త్రివర్ణ పతాకానికి మోదీ ఇచ్చిన గౌరవం ముచ్చటేస్తుంది...

ABN, First Publish Date - 2023-08-23T18:35:40+05:30

దక్షిణాఫ్రికా రాజధాని జోహన్నస్‌బర్గ్‌లో 15వ బ్రిక్స్ సమ్మిట్‌ (BRICS Summit)లో భారత ప్రధాన నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరు, త్రివర్ణ పతాకానికి ఇచ్చిన గౌరవం అందరి అభినందనలు అందుకుంటోంది. తాను నుంచోవలసిన స్థలంలో ఉన్న జాతీయ జెండాను ఏమాత్రం దాటకుండా చేతితో తీసుకుని తన జేబులో పదిలంగా ఉంచుకున్నారు.

జొహన్నస్‌బర్గ్: దక్షిణాఫ్రికా రాజధాని జోహన్నస్‌బర్గ్‌లో 15వ బ్రిక్స్ సమ్మిట్‌ (BRICS Summit)లో భారత ప్రధాన నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరు, త్రివర్ణ పతాకానికి ఇచ్చిన గౌరవం అందరి అభినందనలు అందుకుంటోంది. ప్లీనరీ సమావేశానికి ముందు గ్రూప్‌ ఫోటోకు ఫోజులివ్వలాడినికి ఒక్కొక్కరిని పిలిచారు. మోదీ తన వంతు రాగానే వేదికపైకి చేరుకున్నారు.


నిబంధనల ప్రకారం, నేతల స్టాడింగ్ పొజిషన్‌ను మార్క్ చేసేందుకు ఆ దేశ జెండాను అక్కడ ఉంచుతారు. అక్కడ ఆ దేశ నేత నిలుచోవాల్సి ఉంటుంది. మోదీ తాను నుంచోవలసిన స్థలంలో నేలపై ఉన్న చిన్న త్రివర్ణ పతాకాన్ని గమనించారు. ప్రధాని దానిపైకి అడుగుపెట్టకుండానే కిందకు వంగి ఆ పతాకాన్ని చేతితో తీసుకుని తన స్థానంలో నిలుచున్నారు. జాతీయ పతాకాన్ని జేబులో పెట్టుకున్నారు. అంతకు ముందే దక్షిణాఫ్రికా జాతీయ జెండా ప్లేస్‌లో కాలుపెట్టిన ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రమఫోసా కిందకు వంగి తమ జాతీయ జెండాను తీసుకుని తన సహాయకుడికి దానిని అందించారు. మోదీ మాత్రం చిరునవ్వులు చిందిస్తూ భారత జాతీయ జెండాను తనతోనే అట్టిపెట్టుకున్నారు. ఈ సన్నివేశం అందర్నీ ఆకర్షించడంతో పాటు జాతీయజెండాపై మోదీ చూపిన గౌరవం ప్రశంసలు అందుకుంటోంది.

Updated Date - 2023-08-23T18:42:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising