ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Canada: భారత రాయబారులను చంపాలని కెనడా గురుద్వారాలో వెలిసిన పోస్టర్లు

ABN, First Publish Date - 2023-09-29T08:59:56+05:30

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరువాత భారత్, కెనడాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కెనడాలోని గురుద్వార ఎదుట వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.

కెనడా : ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరువాత భారత్, కెనడాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కెనడాలోని గురుద్వార ఎదుట వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ పోస్టర్లలో భారత దౌత్యవేత్తలను చంపాలని పిలుపునిస్తూ ఈ పోస్టర్లలో ఉంద.ి కెనడియన్ అధికారులు ఆ పోస్టర్లను తొలగించాలని ఖలిస్తానీ అనుకూల మద్దతుదారులను కోరిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం జరిగడం గమనార్హం.


అయితే ఈ పోస్టర్లు చాలా చోట్ల వెలిసినప్పటికీ అధికారులు వాటిని తొలగించారు. గురుద్వారా ప్రధాన ద్వారంలో రెండు వైపుల తొలగించలేదు. ఇందులో ముగ్గురు దౌత్యవేత్తల ఫొటోలతో 'వీరిని చంపాలి' అని పోస్టర్లలో ఉంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించిన తర్వాత ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన వివాదం చెలరేగింది. కెనడియన్ పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది.

Updated Date - 2023-09-29T08:59:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising