Britain : రిషి సునాక్‌పై దర్యాప్తు

ABN, First Publish Date - 2023-04-17T21:54:53+05:30

బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ పై ఆ దేశ పార్లమెంటుకు చెందిన కమిషనర్ ఫర్ స్టాండర్డ్స్ ఇటీవల

Britain : రిషి సునాక్‌పై దర్యాప్తు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్ : బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ (Prime Minister Rishi Sunak)పై ఆ దేశ పార్లమెంటుకు చెందిన కమిషనర్ ఫర్ స్టాండర్డ్స్ ఇటీవల దర్యాప్తును ప్రారంభించింది. ఆసక్తి ప్రకటన (declaration of interest)పై ఈ దర్యాప్తు జరుగుతోంది. ఈ విషయాన్ని కమిషనర్ వెబ్‌సైట్ ద్వారా తెలిపింది. రిషి సతీమణి అక్షత మూర్తికి ఓ చైల్డ్‌కేర్ సంస్థలో వాటాలు ఉండటంతో, ప్రభుత్వ విధానం వల్ల ఆ కంపెనీకి ఏమైనా ప్రయోజనాలు చేకూరాయేమో గుర్తించడం కోసం ఈ దర్యాప్తు జరుగుతోందని రిషి తరపున ఓ అధికార ప్రతినిధి తెలిపారు.

ఓపెన్ ఇంక్వైరీస్ జాబితాను కమిషనర్ ఫర్ స్టాండర్డ్స్ (Commissioner for Standards) వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. ఏప్రిల్ 13 నుంచి రిషి సునాక్‌పై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపింది. ఆసక్తి ప్రకటనపై ఈ దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపింది.

రిషి సునాక్ ప్రభుత్వం మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఓ విధానాన్ని ప్రకటించారు. దీని వల్ల ఓ చైల్డ్‌కేర్ కంపెనీ ప్రయోజనం పొందుతున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఆ చైల్డ్‌కేర్ కంపెనీలో రిషి సతీమణి అక్షత మూర్తి (Akshata Murthy)కి వాటాలు ఉన్నాయని ఈ కథనాలు తెలిపాయి. దీనిపై దర్యాప్తు జరపాలని ప్రతిపక్ష లిబరల్ డెమొక్రాట్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు జరుగుతోంది.

రిషి సునాక్ అధికార ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, తాము కమిషనర్ దర్యాప్తునకు సంతోషంగా సహకరిస్తామన్నారు. అత్యంత పారదర్శకంగా నిర్ణయం తీసుకున్నట్లు వివరిస్తామని చెప్పారు.

హౌస్ ఆఫ్ కామన్స్ ప్రవర్తన నియమావళి, రిజిస్టర్లు సక్రమంగా ఉండేలా పర్యవేక్షించే బాధ్యత కమిషనర్‌దే. ఏమైనా ఉల్లంఘనలు జరిగినట్లు ఆరోపణలు వస్తే, వాటిపై కూడా దర్యాప్తు జరుపుతారు. ప్రవర్తన నియమావళి ప్రకారం పార్లమెంటు సభ్యులు తమకుగల ఆర్థిక ప్రయోజనాల గురించి వెల్లడించవలసి ఉంటుంది. ఈ ప్రయోజనాల వల్ల పార్లమెంటు సభ్యునిగా తన చర్యలు ప్రభావితమవుతాయని, పార్లమెంటులో ప్రసంగాలు లేదా ఓటు వేసే తీరును ప్రభావితం చేయవచ్చునని ఇతరులు భావించే అవకాశం ఉండవచ్చు, అటువంటి సందర్భాల్లో తమకుగల ఆర్థిక ప్రయోజనాలను ఎంపీలు వెల్లడించవలసి ఉంటుంది.

ఈ దర్యాప్తులో రిషి సునాక్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు కమిషనర్ గుర్తిస్తే, క్షమాపణ చెప్పాలని ఆయనను ఆదేశించవచ్చు. భవిష్యత్తులో అటువంటివి జరగకుండా సూచనలు చేయవచ్చు. మరింత తీవ్రమైన కేసులను ఓ కమిటీకి నివేదించే అవకాశం ఉంటుంది. ఆ కమిటీ అవసరమైతే ఇతర ఆంక్షలను విధిస్తుంది. మౌఖిక లేదా లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని కోరవచ్చు. జీతాన్ని నిలిపేయడం, సభ నుంచి కొంత కాలం సస్పెండ్ చేయడం, బహిష్కరించడం వంటి చర్యలు తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి :

Same-sex marriage : స్వలింగ వివాహాలపై పిటిషన్లను తోసిపుచ్చండి.. సుప్రీంకోర్టును కోరిన కేంద్రం..

PM Modi : కుల గణనపై మోదీకి ఖర్గే లేఖ

Updated Date - 2023-04-17T21:54:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising