ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Prigozhin Death: విమాన ప్రమాదంలో ప్రగోజిన్ మృతి చెందారు.. జన్యు పరీక్ష ద్వారా నిర్ధారించిన రష్యా

ABN, First Publish Date - 2023-08-27T20:09:00+05:30

ఆగస్టు 23వ తేదీన రష్యాలో చోటు చేసుకున్న ఓ విమాన ప్రమాదంలో వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్‌జెనీ ప్రిగోజిన్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయాన్ని రష్యా వెంటనే...

ఆగస్టు 23వ తేదీన రష్యాలో చోటు చేసుకున్న ఓ విమాన ప్రమాదంలో వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్‌జెనీ ప్రిగోజిన్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయాన్ని రష్యా వెంటనే ధృవీకరించలేదు. ఇప్పుడు జన్యు పరీక్షల రిపోర్ట్ రావడంతో.. ప్రిగోజిన్ మరణ వార్తను రష్యా ధృవీకరించింది. గత వారం జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మృతి చెందినట్లు జన్యు పరీక్షలు నిర్ధారించాయని ఇన్వెస్టిగేటివ్ కమిటీ అధికార ప్రతినిధి స్వెత్లానా పెట్రెంకో తెలిపారు.


ప్రిగోజిన్‌తో పాటు మరో 9 మంది కూడా మరణించారని చెప్పారు. ఆ 9 మందిలో డిమిత్రి ఉట్కిన్ (వాగ్నర్ గ్రూప్ నిర్వహణలో ప్రధాన వ్యక్తి) ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే.. ఈ విమానం కూలిపోవడానికి గల కారణాల్ని మాత్రం రష్యా అధికారులు వెల్లడించేదు. మొదట్లో ఈ విమాన ప్రమాదం జరిగిన వెంటనే.. దీని వెనుక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హస్తం ఉండొచ్చన్న అనుమానాలు రేకెత్తాయి. రెండు నెలల క్రితం పుతిన్‌పై ప్రిగోజిన్ తిరుగుబాటు చేయగా.. అందుకు ప్రతీకారంగానే కుట్ర పన్ని ఆయన్ను చంపి ఉండొచ్చని ప్రచారం జరిగింది. ముఖ్యంగా.. పాశ్చాత్త దేశాలైతే ప్రిగోజిన్ మరణం వెనుక కుట్ర కోణం దాగి ఉందని బలమైన వాదనలు వినిపించాయి. అయితే.. ఈ ఆరోపణల్ని క్రెమ్లిన్ ఖండించింది. అదంతా పచ్చి అబద్ధమని కొట్టిపారేసింది.

మరోవైపు.. ప్రిగోజిన్ మరణించిన తర్వాత వాగ్నర్ గ్రూప్‌ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడం కోసం పుతిన్ పావులు కదపడం ప్రారంభించారు. ఇప్పటికే ఆయన శుక్రవారం ఒక డిక్రీపై సంతకం చేశారు. ఈ డిక్రీ ప్రకారం.. వాగ్నర్‌ కిరాయి సైనికులందరూ రష్యాకు విధేయంగా ఉంటామని సంతకం చేయాలని. లేకపోతే వాళ్లందరూ ప్రాసిక్యూషన్‌ ఎదుర్కొనే ప్రమాదం ఉంది. జైల్లోకి వెళ్లే అవకాశమం కూడా ఉంది. ప్రిగోజిన్ తరహాలోనే ఇతరులు తిరుగుబాటు చేయకుండా ఉండేందుకు.. పుతిన్ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

Updated Date - 2023-08-27T20:09:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising