ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Putin : అమెరికా ఆ పని చేస్తే...మేమూ అణ్వస్త్ర పరీక్షలకు సిద్ధం

ABN, First Publish Date - 2023-02-21T19:00:12+05:30

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా ఉక్రెయిన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకస్మిక పర్యటన జరపడంపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా ఉక్రెయిన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఆకస్మిక పర్యటన జరపడంపై రష్యా నిప్పులు చెరుగుతోంది. యుద్ధానికి కారణం పశ్చిమ దేశాలేనని, ఇది తూర్పు దేశాలపై పశ్చిమ దేశాల 'క్రూయల్ గేమ్‌' అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) విమర్శలు గుప్పించారు. అమెరికా అణు పరీక్షలు జరిపితే రష్యా సైతం అణ్వస్త్ర పరీక్షలకు వెనుకాడేది లేదని హెచ్చరించారు.

''అణ్వస్త్ర పరీక్షలకు అమెరికా సిద్ధమైన పక్షంలో రష్యా సైతం తిరిగి అణు పరీక్షలు జరుపుతుంది. వెనుకంజ వేసే ప్రసక్తే లేదు'' అని పుతిన్ తెలిపారు. ఇదే జరిగితే ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అణ్వాస్త్ర పరీక్షలపై విధించిన అంతర్జాతీయ నిషేధం (Global Ban) ముగిసినట్టేనని అన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా ఓటమే లక్ష్యంగా అమెరికా, నాటో భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నందునే 'START' ఒప్పందంపై రష్యా అభ్యంతరాలు వ్యక్తం చేసిందని అన్నారు. తమను వ్యూహాత్మకంగా ఓడించాలని అమెరికా, నాటో పక్షాలు కోరుకుంటున్నాయని, ఇదే సమయంలో తమ అణు స్థావరాలను తమ అధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాయని ఆరోపించారు. ఇందుకోసం నాటో నిపుణుల సాయంతో తమ డ్రోన్‌లను ఆధునికీకరిస్తున్నారని అన్నారు. ''ఇప్పుడు మన రక్షణ స్థావరాలను కూడా వారు తనిఖీ చేయాలనుకుంటున్నారు. ఇవాల్టి ఘర్షణ వాతావరణంలో ఇది పూర్తిగా అసంబద్ధం'' అని పుతిన్ స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌లో పశ్చిమ దేశాలే యుద్ధాన్ని ప్రారంభించాయని, దాన్ని ఆపడానికి రష్యా శాయశక్తులా ప్రయత్నం చేస్తోందని చె్పపారు. పశ్చిమదేశాలతో భద్రతా పరంగా దౌత్య మార్గాన్ని అనుసరించి సమస్యను పరిష్కరించుకునేందుకు తాము సిద్ధమన్నారు. ఉక్రెయిన్‌కు ఎంత ఎక్కువగా ఆయుధాలు పంపితే అంత ఎక్కువ కాలం రష్యా దాటి చేస్తుందని హెచ్చరించారు. పాశ్చాత్య నాయకులు ఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటుంటే, ప్రజలను రక్షించాలని రష్యా కోరుకుంటోందని పుతిన్ చెప్పారు.

Updated Date - 2023-02-21T19:00:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising