ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SpaceX Starship: ప్రయోగించిన కాసేపటికే.. గాల్లోనే పేలిపోయిన ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్

ABN, First Publish Date - 2023-04-20T20:01:00+05:30

తొలుత చంద్రుడిపైకి, ఆ తర్వాత అంగారకుడు, ఆపై గ్రహాల్లోకి వ్యోమగాములను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తొలుత చంద్రుడిపైకి, ఆ తర్వాత అంగారకుడు, ఆపై గ్రహాల్లోకి వ్యోమగాములను మోసుకెళ్లేందుకు నిర్మించిన ప్రపంచంలోనే శక్తిమంతమైన అతిపెద్ద రాకెట్ ‘స్టార్‌షిప్’ (Starship) తొలి టెస్టింగులోనే పేలిపోయింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌(Elon Musk)కు చెందిన స్పేస్‌ఎక్స్(SpaceX) సంస్థ దీనిని నిర్మించింది. టెక్సాస్‌లోని బొకా చికా ప్రాంతంలోని స్పేస్ఎక్స్ స్పేస్ పోర్టు నుంచి దీనిని ప్రయోగించిన కాసేపటికే గాల్లో పెద్ద శబ్దంతో పేలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

విజయవంతంగా నింగిలోకి ఎగసిన స్టార్‌‌షిప్ క్యాప్సూల్ మొదటి దశలో రాకెట్ బూస్టర్ నుంచి వేరయ్యే క్రమంలో సెపరేషన్ విఫలమైంది. ఫలితంగా రాకెట్ మండిపోయింది. ఫ్లైట్ టెస్ట్ అనుకున్నంత ఉత్తేజకరంగా సాగలేదని స్పేస్ఎక్స్ ట్వీట్ చేసింది.

ఈ స్టార్‌షిప్‌ సూపర్ హెవీలో రాప్టార్ ఇంజిన్లను ఉపయోగించారు. వీటిలో మిథేన్(CH4), లిక్విడ్ ఆక్సిజన్(LOX) ఇంధనాన్ని ఉపయోగించారు. మొత్తంగా 33 రాప్టార్ ఇంజిన్లు మొదటి దశ బూస్టర్‌కు శక్తినిస్తాయి. భూమికి ఆవల ప్రయాణానికి 150 టన్నుల కార్గోను తీసుకెళ్తేందుకు అవసరమైన 1,67,33,085 పౌండ్ల థ్రస్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Updated Date - 2023-04-20T20:01:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising