ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Turkey earthquake: టర్కీలో మళ్లీ భారీ భూకంపం...ముగ్గురి మృతి, 213 మందికి గాయాలు

ABN, First Publish Date - 2023-02-21T07:11:57+05:30

అసలే భారీ భూకంపంతో అల్లాడుతున్న టర్కీలో మళ్లీ మరోసారి రెండు భారీ భూకంపాలు సంభవించాయి....

Turkey hit by another earthquake
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అంటక్యా (టర్కీ): అసలే భారీ భూకంపంతో అల్లాడుతున్న టర్కీలో మళ్లీ మరోసారి రెండు భారీ భూకంపాలు సంభవించాయి.(Turkey earthquake) సోమవారం రాత్రి టర్కీలోని హటే ప్రావిన్స్‌లోని అంటక్యాలో భూకంపం సంభవించింది.(Turkey hit by another earthquake) తాజా భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భారీ భూకంపం(deadly tremors) ప్రభావం వల్ల ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 213 మందికి పైగా గాయపడ్డారని టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ సోయ్లును చెప్పారు.

గత పక్షం రోజుల క్రితం టర్కీలో సంభవించిన వినాశకరమైన భూకంపం తర్వాత భవనాల శిథిలాల కింద బాధితుల ప్రాణాలను రక్షించడానికి టర్కీ ప్రభుత్వం రెండు ప్రావిన్స్‌లలో పెద్ద రెస్క్యూ, సెర్చ్ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉంది. మరో వైపు సోమవారం టర్కీ-సిరియా సరిహద్దు ప్రాంతంలో మరో రెండు భూకంపాలు సంభవించాయని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. దక్షిణ టర్కీలో సోమవారం సంభవించిన రెండు తాజా భూకంపాలపై యునైటెడ్ స్టేట్స్ తీవ్ర ఆందోళన చెందుతోందని జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ చెప్పారు. టర్కీకి పూర్తి మద్ధతు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : ఆ రెండు నగరాల్లో గర్భనిరోధక మాత్రలపై నిషేధాస్త్రం...ఎందుకంటే...

రెండు వారాల క్రితం ప్రకంపనల తర్వాత టర్కీవాసులు తాత్కాలిక గుడారాల్లో నివసిస్తున్నారు. మళ్లీ భూకంపం వచ్చినప్పుడు తాను సెంట్రల్ అంటక్యాలోని(Antakya) ఒక పార్కు టెంట్‌లో ఉన్నానని స్థానిక నివాసి మునా అల్ ఒమర్ చెప్పారు.‘‘నా కాళ్ల కింద భూమి చీలిపోతుందని అనుకున్నాను’’ అని తన ఏడేళ్ల కొడుకును తన చేతుల్లో పట్టుకుని ఏడుస్తూ మునా అల్ ఒమర్ చెప్పింది.సోమవారం నాడు వచ్చిన భూకంపం దక్షిణ టర్కిష్ నగరం అంటాక్యా సమీపంలో కేంద్రీకృతమై ఉంది. సిరియా, ఈజిప్ట్, లెబనాన్‌లలో(Syria, Egypt and Lebanon) భూకంపం సంభవించింది.

Updated Date - 2023-02-21T07:32:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!