US Plane Collision: గగనతలంలో ఢీకొన్న విమానాలు...ఒకరి మృతి
ABN, First Publish Date - 2023-03-08T11:40:20+05:30
ఫ్లోరిడాలోని సరస్సుపై రెండు విమానాలు గగనతలంలో ఢీకొన్న ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు....
ఫ్లోరిడా: ఫ్లోరిడాలోని సరస్సుపై రెండు విమానాలు గగనతలంలో ఢీకొన్న ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు.(US Plane Collision) రెండు వైమానిక దళ విమానాలు గగనతలంలోనే ఢీకొన్నాయి.(Lake In Florida) రెండు విమానాలు గాలిలో ఢీకొని కూలిపోయాయి.(Mid Air Accident)ప్రమాదానికి గురైన విమానం ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విమానాల్లో ఒకటైన పైపర్ జే-3 ఫ్లోట్‌ప్లేన్‌గా గుర్తించారు.మంగళవారం రాత్రి వింటర్ హెవెన్‌లోని లేక్ హాట్రిడ్జ్‌లో ప్రాణాలతో బయటపడిన వారి కోసం రెస్క్యూ సిబ్బంది వెతుకుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి రెస్క్యూ సిబ్బంది సీపీఆర్ చేసేందుకు యత్నించినా ప్రాణాలు కోల్పోయాడు.ఈ విమానాలు ఎక్కడికి బయలుదేరాయి? కూలిపోవడానికి కారణాలు ఇంకా తెలియలేదు.విమానాలు పడిపోయిన సరస్సు వింటర్ హెవెన్ ప్రాంతీయ విమానాశ్రయానికి ఆగ్నేయంలో ఉంది.విమానాలు ఒకదానికొకటి ఢీకొని వెంటనే నీటిలో పడిపోయాయని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.ఈ విమానాల ప్రమాదంపై ఎఫ్‌ఎఎ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ దర్యాప్తు చేస్తాయని అధికారులు చెప్పారు.
Updated Date - 2023-03-08T11:40:20+05:30 IST