British Prime Minister : కారులో సీటుబెల్ట్ ధరించనందుకు రిషి సునాక్ క్షమాపణలు
ABN, First Publish Date - 2023-01-20T08:07:57+05:30
బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ గురువారం క్షమాపణలు చెప్పారు....
లండన్(యూకే) : బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ గురువారం క్షమాపణలు చెప్పారు.(British Prime Minister)కారు ప్రచార వీడియోలో సీటుబెల్ట్ ధరించనందుకు రిషి సునాక్(Rishi Sunak) క్షమాపణలు చెప్పారు.(Apologize)తన సీటు బెల్ట్‌ను తొలగించి తప్పు చేశానని రిషి అంగీకరించారు.నార్త్-వెస్ట్ ఇంగ్లండ్‌లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సోషల్ మీడియా వీడియోను చిత్రీకరించడానికి తన సీట్ బెల్ట్ తొలగించడంలో(Not Wearing Seatbelt) పొరపాటు జరిగిందని రిషి చెప్పారు.బ్రిటీష్ చట్టం ప్రకారం వాహనం కదులుతున్నప్పుడు సీటు బెల్ట్ ధరించనందుకు డ్రైవర్లు, ప్రయాణీకులకు 500 పౌండ్ల జరిమానాను విధిస్తారు.ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ ధరించాలని ప్రధాన మంత్రి రిషి ప్రజలను కోరారు.
Updated Date - 2023-01-20T08:18:44+05:30 IST