ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shahid Latif: అసలు ఎవరీ షాహిద్ లతీఫ్.. అతడు చేసిన నేరాలేంటి.. పఠాన్‌కోట్ దాడిలో అతని పాత్రేంటి?

ABN, First Publish Date - 2023-10-11T17:21:58+05:30

2016లో జరిగిన పఠాన్‌కోట్ దాడి గుర్తుందా? ఈ దాడి సూత్రధారి అయిన పాకిస్తాన్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ అక్టోబర్ 11వ తేదీన హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఈ ఉగ్రవాదితో పాటు అతని ఇద్దరు సహచరులను...

2016లో జరిగిన పఠాన్‌కోట్ దాడి గుర్తుందా? ఈ దాడి సూత్రధారి అయిన పాకిస్తాన్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ అక్టోబర్ 11వ తేదీన హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఈ ఉగ్రవాదితో పాటు అతని ఇద్దరు సహచరులను కూడా గుర్తు తెలియని ముగ్గురు దుండగులు కాల్చి చంపారు. సియాల్‌కోట్‌లోని ఒక మసీదు వెలుపల అతనిపై కాల్పులు జరిపారు. లతీఫ్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. లతీఫ్‌ని హతమార్చడానికి గల కారణాలేంటో ఇంకా వెలుగులోకి రాలేదు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


అసలు ఎవరు ఈ షాహిద్ లతీఫ్?

పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలా నగరంలో షాహిద్ లతీఫ్ నివాసం ఉండేవాడు. చిన్నప్పటి నుంచే ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితుడైన అతడు, భారత్‌పై ద్వేషం పెంచుకున్నాడు. పాకిస్థాన్ అనూకుల ఉగ్రవాద సంస్థ అయిన జైషే మొహమ్మద్‌లో చేరాడు. అక్కడ శిక్షణ పొందాడు. భారత్‌పై దాడులు చేయడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. తొలుత లతీఫ్ 1993లో పాకిస్తాన్ నుంచి కశ్మీర్‌లోకి అక్రమంగా చొరబడ్డాడు. భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచే అతడు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ వచ్చాడు. అయితే.. ఒక సంవత్సరం తర్వాత అంటే 1994లో ఉగ్రవాద ఆరోపణలపై అతడు భారత్‌లో అరెస్ట్ అయ్యాడు. అప్పుడే అతనికి అదే జైలులో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్‌తో పరిచయం ఏర్పడింది.

కట్ చేస్తే.. 1999లో ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ 814 విమానాన్ని హైజాక్ చేశారు. ఈ కేసులోనూ షాహిద్ లతీఫ్ నిందితుడిగా ఉన్నాడు. అంటే.. జైలులో నుంచే అతడు ఉగ్రవాద కార్యకలాపాలు నడిపించాడు. ఆ విమానంలో 189 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఉంది. ఆ ఫ్లైట్‌ని హైజాక్ చేశాక ఉగ్రవాదులు తమ లీడర్ మసూద్ అజహర్‌తో పాటు మరో ఇద్దరిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడు భారత ప్రభుత్వానికి మరో దారి లేకపోవడంతో.. ఉగ్రవాదుల డిమాండ్ మేరకు మసూద్‌తో పాటు మరో ఇద్దరిని విడిచిపెట్టారు. లతీఫ్ మాత్రం జైలులోనే ఉన్నాడు. చివిరికి 16 ఏళ్ల జైలు జీవితం గడిపిన అనంతరం.. 2010లో నేరస్తుల అప్పగింతల్లో భాగంగా వాఘా సరిహద్దు ద్వారా లతీఫ్‌ని పాకిస్తాన్‌కు తిరిగి పంపించారు.


2016లో పఠాన్ కోట్ దాడి

అయితే.. అప్పటికీ లతీఫ్‌లో మార్పు రాలేదు. పాక్‌లో అడుగుపెట్టిన వెంటనే అతగాడు జైషే మహమ్మద్ సంస్థలో చేరాడు. ఈ విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వం అతడ్ని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అయితే.. పాక్‌ మాత్రం మాత్రం అతడ్ని ఈ ఉగ్రనాగుని పోషిస్తూ వచ్చింది. క్రమంగా అతడు జేషే మహమ్మద్ సంస్థకు లాంచింగ్ కమాండర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలోనే అతడు పఠాన్‌కోట్ దాడులకు పన్నాగం పన్నాడు. 2016లో పఠాన్‌కోట్ వైమానిక దళంలోకి నలుగురు ఉగ్రవాదులు చొరబడేలా సహకరించాడు. అలా లోపలికి చొరబడిన ఆ ఉగ్రవాదులు దాడి చేశారు. దాదాపు 4 రోజుల పాటు జరిగిన ఈ కాల్పుల్లో ఆ నలుగురు ఉగ్రవాదులూ మరణించారు. కానీ.. ఏడుగురు భద్రతా సిబ్బందితో పాటు ఒక పౌరుడు కూడా మృతి చెందడం బాధాకరం.

అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మార్చిలో ఈ పఠాన్‌కోట్‌ ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. ఈ దాడి వెనుక లతీఫ్ ఉన్నాడని స్పష్టం కావడంతో.. అతడ్ని పట్టుకోవడం కోసం అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. కానీ.. పాక్ మాత్రం అతడ్ని పెళ్లికూతురు దాచినట్టుగా దాచుతూ, పోషిస్తూ వచ్చింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అతని పాపం పండింది. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో అతడు హతమయ్యాడు.

Updated Date - 2023-10-11T17:21:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising