ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israeli-Hamas Conflict: వాళ్లు దాక్కున్న ప్రాంతాలు శిథిలమవుతాయి.. హమాస్‌కు ఇజ్రాయెల్ డెడ్లీ వార్నింగ్

ABN, First Publish Date - 2023-10-08T08:49:23+05:30

ఇజ్రాయెల్‌లో ఉగ్రదాడులకు తెగపడిన పాలస్తీనా హమాస్ మిలిటెంట్లకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ‘‘ గాజా నగరంలో వాళ్లు దాక్కున్న ప్రాంతాలు శిథిలమవుతాయి’’ అని వార్నింగ్ ఇచ్చారు. గాజా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.

జెరూసలేం: ఇజ్రాయెల్‌లో ఉగ్రదాడులకు తెగపడిన పాలస్తీనా హమాస్ మిలిటెంట్లకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ‘‘ గాజా నగరంలో వాళ్లు దాక్కున్న ప్రాంతాలు శిథిలమవుతాయి’’ అని వార్నింగ్ ఇచ్చారు. గాజా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ఇజ్రాయెల్ దళాలు ప్రతిచోటా శక్తివంతమైన ఆపరేషన్లు నిర్వహిస్తామని అప్రమత్తం చేశారు.

‘‘ హమాస్ మోహరించి, దాగివున్న, కార్యకలాపాలకు అడ్డగా ఉన్న దుర్మార్గపు ప్రదేశాలన్నింటిని మేము శిథిలాలుగా మారుస్తాం. నేను గాజా వాసులకు చెబుతున్నాను ఇప్పుడే వెళ్లిపోండి. ఎందుకంటే మేము ప్రతిచోటా శక్తివంతమైన ఆపరేషన్లు నిర్వహిస్తాం’’ అని అతను ఒక ఎక్స్‌ వేదికగా హెచ్చరించారు. ఇజ్రాయెల్‌లో యుద్ధ పరిస్థితులు ఉన్నాయని ప్రకటించిన మరుసటి రోజయిన ఆదివారం ఈ మేరకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.


కాగా.. ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులు జరిపిన ఆకస్మిక దాడుల్లో మృతుల సంఖ్య 400 దాటిందని అంతర్జాతీయ మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. దక్షిణ ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో రాకెట్ మోతలు ఇంకా మోగుతూనే ఉన్నాయని ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది. ఇక హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రారంభించిన ‘ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్’తో గాజాలో 230 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. కాగా శనివారం జరిగిన భయానక దాడులపై నెతన్యాహూ స్పందిస్తూ.. "మేము ఆపరేషన్ కాదు యుద్ధం చేస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రభుత్వం, పౌరులపై హమాస్ ఆకస్మిక నరమేదాన్ని ప్రారంభించింది. చొరబడిన ఉగ్రవాదులను తుదముట్టించాలని నేను ఆదేశించాను. శత్రువులు ఇదివరకు ఎప్పుడు కనీవినీ ఎరుగని విధంగా మూల్యం చెల్లించుకుంటారు’’ అని ఆయన శనివారం వీడియో ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.

Hamas - Israel War : రాకెట్ల రణం... హమాస్‌ - ఇజ్రాయెల్‌ మధ్య మళ్లీ యుద్ధం.. వందల రాకెట్లతో దాడి..

Updated Date - 2023-10-08T09:19:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising