ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Taliban: మహిళల హక్కులకు ప్రాధాన్యం లేదు.. తేల్చి చెప్పిన తాలిబన్లు

ABN, First Publish Date - 2023-01-15T21:17:52+05:30

అఫ్ఘాన్ మహిళలు యూనివర్సిటీల్లో చదవకూడదంటూ నిషేధం విధించిన తాలిబన్లు తాజా తమ వైఖరి ఏంటో మరింత స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అఫ్ఘాన్ మహిళలు(Afghanistan woman) యూనివర్సిటీల్లో చదవకూడదంటూ నిషేధం విధించిన తాలిబన్లు(Taliban) తాజాగా తమ వైఖరి ఏంటో మరింత స్పష్టం చేశారు. తాము మహిళల హక్కులకు ప్రాధాన్యం ఇవ్వట్లేదని ఒక్కముక్కలో తేల్చి చెప్పారు. మహిళలపై విధించిన ఆంక్షల ఎత్తివేతకు తాము ప్రాముఖ్యత ఇవ్వట్లేదని పేర్కొన్నారు. ఈ మేరకు తాలిబన్ల అధికార ప్రతినిధి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ దేశంలోని అన్ని అంశాలను షరియా చట్టం ప్రకారమే నిర్వహిస్తాం. షరియా చట్టానికి విరుద్ధమైన వాటిని అంగీకరించలేం’’ అని పేర్కొన్నారు.

మరోవైపు.. తమను యూనివర్సిటీ చదువులకు దూరం చేయడంపై అక్కడి మహిళలు ఉద్యమిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఇక.. పలు దేశాలు తాలిబన్ల చర్యలను ముక్తకంఠంతో ఖండించాయి. మహిళల విద్యాభ్యాసంపై నిషేధం ఎత్తివేయాలని, స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసుకునేందుకు వారిని అనుమతించాలని డిమాండ్ చేస్తున్నాయి. యూనిసెఫ్ నివేదిక ప్రకారం.. బాలికలను మాధ్యమిక విద్యకు దూరం చేయడంతో అఫ్ఘానిస్థాన్‌ ఆర్థికవ్యవస్థకు గత 12 నెలల్లో 500 మిలియన్ డాలర్ల నష్టం జరిగింది. దేశ జీడీపీలో ఇది 2.5 శాతానికి సమానం. అయితే.. తమకున్న మతపరమైన ప్రాధాన్యాలను ప్రపంచదేశాలు అర్థం చేసుకోవాలని తాలిబన్లు సూచించారు.

Updated Date - 2023-01-15T23:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising