ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20ు సుంకం

ABN, First Publish Date - 2023-08-27T03:21:23+05:30

ఉప్పుడు బియ్యం(పార్‌బాయిల్డ్‌) ఎగుమతులపై 20ు సుంకం విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 25 నుంచే ఎగుమతి సుంకం విధింపును అమల్లోకి తీసుకురాగా.. అక్టోబరు 16 వరకు ఇది అమల్లో ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌లో వెల్లడించింది. అయితే లెట్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్డరు (ఎల్‌ఈవో)

దేశీయంగా ధరలను అదుపు చేసేందుకు కేంద్రం చర్య

న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఉప్పుడు బియ్యం(పార్‌బాయిల్డ్‌) ఎగుమతులపై 20ు సుంకం విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 25 నుంచే ఎగుమతి సుంకం విధింపును అమల్లోకి తీసుకురాగా.. అక్టోబరు 16 వరకు ఇది అమల్లో ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌లో వెల్లడించింది. అయితే లెట్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్డరు (ఎల్‌ఈవో) మంజూరుకాకుండా కస్టమ్స్‌ పోర్టుల్లో ఉన్న బియ్యానికి ఈ సుంకం నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. అలాగే ఆగస్టు 25కన్నా ముందు చెల్లుబాటయ్యే లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌సీ) ఉన్న వాటికి ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. దేశీయంగా ఈ బియ్యం నిల్వలను సరిపోయేంతగా ఉంచడంతోపాటు ధరలను అదుపులో ఉంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత నెలలో ప్రభుత్వం బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధించిన విషయం తెలిసిందే. వచ్చే పండగల సీజన్‌లో దేశీయంగా ఈ బియ్యం సరఫరాను మెరుగుపరిచేందుకు, రిటైల్‌ ధరలను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా.. ఉల్లి బఫర్‌ స్టాక్‌ను పెంచుకునే చర్యల్లో భాగంగా గత నాలుగు రోజుల్లో రైతుల నుంచి నేరుగా 2,826 టన్నుల ఉల్లిగడ్డలను కొనుగోలు చేసినట్టు నేషనల్‌ కోఆపరేటివ్‌ కన్జ్యూమర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీసీఎ్‌ఫ) శనివారం వెల్లడించింది.

Updated Date - 2023-08-27T03:21:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising