ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sikkim:లోనాక్ సరస్సు వరదలపై 2021లోనే హెచ్చరించిన పరిశోధకుల బ‌ృందం

ABN, First Publish Date - 2023-10-05T17:38:41+05:30

సిక్కింలో క్లౌడ్ బరస్ట్(Cloud Burst) వల్ల భారీ విధ్వంసం సంభవించింది. సౌత్ లొనాక్(South Lonak) సరస్సుకి వరదలు పోటెత్తడంతో తీస్తా నది నీటి మట్టం పెరిగింది. దీంతో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. అయితే భారీ వర్షాలు కురిస్తే లోనాక్ సరస్సు ప్రమాదకరంగా మారుతుందని గతంలోనే ఓ నివేదిక వెల్లడించింది.

గ్యాంగ్ టక్: సిక్కింలో క్లౌడ్ బరస్ట్(Cloud Burst) వల్ల భారీ విధ్వంసం సంభవించింది. సౌత్ లొనాక్(South Lonak) సరస్సుకి వరదలు పోటెత్తడంతో తీస్తా నది నీటి మట్టం పెరిగింది. దీంతో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. అయితే భారీ వర్షాలు కురిస్తే లోనాక్ సరస్సు ప్రమాదకరంగా మారుతుందని గతంలోనే ఓ నివేదిక వెల్లడించింది. జియోమార్పాలజీ జర్నల్ 2021లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. ఆ సరస్సుపై భారీ వర్షాలు కురిస్తే తీర ప్రాంత ప్రజలకు పెను ముప్పు పొంచి ఉంటుంది. తాజాగా అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ పరిశోధన నిజమేనని తేలింది. అక్టోబర్ 3 - 4 దక్షిణ లొనాక్ సరస్సుపై భారీ వర్షం కురసింది.


దీంతో తీర ప్రాంతంలో వరదలు(Floods) సంభవించాయి. వరదల ధాటికి 14 మంది మరణించారు. 22 మంది సైనిక సిబ్బందితో సహా 102 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన సిక్కింలో అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు అయిన చుంగ్తాంగ్ డ్యామ్‌కు డ్యామేజ్ చేసింది. వరదల ప్రభావం పొరుగునే ఉన్న వెస్ట్ బెంగాల్(West Bengal) రాష్ట్రాన్ని తాకింది. తీస్తా నదికి దిగువనున్న ప్రాంతాలకు భారీగా వరద వచ్చి చేరింది. బెంగాల్ లోని కాళీంపాంగ్ జిల్లా తీస్తా బజార్ లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. కొన్ని ఇళ్లు కొట్టుకుపోగా.. మరి కొన్ని ఇళ్లల్లో పూర్తిగా ధ్వంసమయ్యాయి. సిక్కింలో మొత్తంగా 11 వంతెనలు కొట్టుకుపోయాయి. వేలాదిగా నిరాశ్రయులయ్యారు. దీంతో ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది.

Updated Date - 2023-10-05T17:38:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising