Covid 19: కరోనా హాట్ స్పాట్‌గా గోవా? పెరుగుతున్న కేసులతో న్యూఇయర్ సెలబ్రేషన్లపై నీలినీడలు
ABN, Publish Date - Dec 21 , 2023 | 08:42 AM
దేశంలో JN.1 వేరియంట్(Corona Varients) కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా 21 కరోనా కేసులు నమోదయ్యాయి. సదరు వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే స్వభావం కలిగి ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
ఢిల్లీ: దేశంలో JN.1 వేరియంట్(Corona Varients) కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా 21 కరోనా కేసులు నమోదయ్యాయి. సదరు వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే స్వభావం కలిగి ఉందని డాక్టర్లు చెబుతున్నారు. తాజాగా నమోదైన 21 కేసుల్లో 19 గోవాలోనే ఉండటం ఆ రాష్ట్రం కరోనాకి హాట్ స్పాట్ గా మారిందా? అనే అనుమానాలను కలిగిస్తోంది. కేసుల్లో కేరళ, మహారాష్ట్రల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. గోవా(Goa)లోనే కేసుల వృద్ధి ఎక్కువగా ఉండటం గమనార్హం.
నూతన సంవత్సర వేడుకలు సిద్ధమవుతున్న దేశ ప్రజలకు కరోనా కేసుల పెరుగుదల అడ్డంకిగా మారింది. వైరస్ ఉద్ధృతి తగ్గకపోతే ప్రభావిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉంది. సబ్ వేరియంట్ కు చెందిన ఈ వైరస్ పై అధ్యయనానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్(ICMR) పని చేస్తోందని డాక్టర్లు తెలిపారు. అయితే ఈ వేరియంట్ పట్ల భయపడాల్సిన అవసరం లేదని.. కానీ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
ఢిల్లీకి చెందిన వైద్యుడు కుమార్ మాట్లాడుతూ.. "కరోనా కేసుల పెరుగుదలను గమనిస్తున్నాం. అనుమానితులకు పరీక్షలు జరుగుతున్నాయి. పాజిటివ్ వచ్చిన రోగులను జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపుతున్నాం. తద్వారా కొత్త వేరియంట్‌లను గుర్తించవచ్చు. ఇప్పటివరకు ఢిల్లీలో కొత్త వేరియంట్ కేసు ఒక్కటీ నమోదు కాలేదు. వైరస్ సోకిన వారు జాగ్రత్తగా ఉండాలి. లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. గొంతు నొప్పి, దగ్గు, జలుబు, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఆస్తమా రోగులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చలికాలంలో కేసుల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలి. గుండె జబ్బులు, షుగర్ వ్యాధిగ్రస్తులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి" అని సూచించారు.
"మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"
Updated Date - Dec 21 , 2023 | 08:47 AM