ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat Earthquake: గుజరాత్‌లో స్వల్ప ప్రకంపనలు

ABN, First Publish Date - 2023-02-11T19:39:20+05:30

గుజరాత్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్​స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: గుజరాత్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్​స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత 12.52 గంటల ప్రాంతంలో సూరత్ జిల్లాలో ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు ఇన్‌స్టిట్యూట్ ఆప్ సిస్మొలాజికల్ రీసెర్చ్ (ISR) అధికారులు తెలిపారు. ఈ భూకంప కేంద్రం సూరత్‌కు నైరుతి దిశగా 27 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్నట్టు గుర్తించారు. 5.2 కిలోమీటర్ల లోతుతో ఇది రికార్డయిందని, అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని జిల్లా డిజాస్టర్ మేనేజిమెంట్ అధికారి ఒకరు తెలిపారు.

గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ గణాంకాల ప్రకారం, 1819, 1845, 1847, 1949, 1964, 1903, 1938, 1956, 2001ల్లో హై రిస్క్ భూకంపాలను గజరాత్ చవి చూసింది. కచ్ ప్రాంతంలో 2001లో సంభవించిన భారీ భూకంపంలో 13,800 మంది మృతి చెందారు. 1.67 లక్షల మంది గాయపడ్డారు. గత రెండు శతాబ్దాల్లో భారత్‌లో విధ్వంసం సృష్టించిన అతి పెద్ద భూకంపాల్లో ఇది రెండవది.

Updated Date - 2023-02-11T19:39:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising