ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Modi: కొనసాగుతున్న వేటు.. మోదీ భద్రతా వైఫల్యానికి కారణమైన 7 మంది పోలీసుల సస్పెండ్

ABN, First Publish Date - 2023-11-26T12:13:00+05:30

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జనవరిలో పంజాబ్ లోపర్యటిస్తున్నప్పుడు తలెత్తిన భద్రతా లోపానికి కారకులుగా పేర్కొంటూ పోలీస్ అధికారుల సస్పెన్షన్ కొనసాగుతోంది. తాజాగా మరో 7 మంది పోలీసులను సస్పెండ్ చేశారు.

చండీగఢ్: ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జనవరిలో పంజాబ్ లోపర్యటిస్తున్నప్పుడు తలెత్తిన భద్రతా లోపానికి కారకులుగా పేర్కొంటూ పోలీస్ అధికారుల సస్పెన్షన్ కొనసాగుతోంది. తాజాగా మరో 7 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. వీరిలో ఫిరోజ్‌పూర్ జిల్లాలోని అప్పటి పోలీసు సూపరింటెండెంట్, ఇద్దరు DSP స్థాయి అధికారులు ఉన్నారు. డీఎస్పీ ర్యాంక్ అధికారులు పర్సన్ సింగ్, జగదీష్ కుమార్, ఇన్‌స్పెక్టర్లు జతీందర్ సింగ్, బల్వీందర్ సింగ్, సబ్ ఇన్‌స్పెక్టర్ జస్వంత్ సింగ్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ రమేష్ కుమార్‌లను సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 2022 జనవరి 5న పంజాబ్‌ (Punjab) పర్యటనలో భద్రతా లోపం (Security lapse)పై బడిండా (Bathinda) ఎస్‌పీ గుర్వీందర్ సింగ్ సంఘా (Gurwinder Singh Sangha)ను నిన్న సస్పెండ్ చేశారు. పంజాబ్ హోం మంత్రిత్వ శాఖ శనివారం ఈ విషయం తెలిపింది. ఫెరోజ్‌పూర్‌లో ఎస్‌పీ ఆపరేషన్స్‌ కోసం నియమించిన గుర్విందర్ సింగ్ విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొంది


భద్రతా వైఫల్యం ఇలా..

ప్రధానమంత్రి 2022 జనవరి 5న ఫెరోజ్‌పూర్ నుంచి హుస్సైనివాలా వెళ్తుండగా భద్రతా లోపం తలెత్తింది. ఉదయం 5 గంటలకు బటిండా చేరిన ప్రధాని అక్కడి నుంచి హుస్సైనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకం వద్దకు హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో మోదీ ప్రయాణించారు. అమరవీరుల స్మారకానికి 30 కిలోమీటర్ల దూరంలో ఒక ఫ్లై ఓవర్ దగ్గరకు ఆయన కాన్వాయ్ వచ్చేసరికి కొందరు ఆందోళనకారులు రోడ్లును దిగ్బంధం చేశారు.

దీంతో ఫ్లై ఓవర్ పైనే ప్రదాని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆయన ముందుగా అనుకున్న కార్యాక్రమానికి, ర్యాలీకి హాజరుకాకుండానే పంజాబ్‌ నుంచి వెనక్కి తిరిగి వచ్చేశారు. 2022 జనవరిలో కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్ని పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధాని పర్యటనలో జరిగిన భద్రతా వైఫల్యంపై పలువురు రాష్ట్ర అధికారులను సుప్రీంకోర్టు నియామక కమిటీ తప్పుపట్టింది. 22 నెలల అనంతరం దీనిపై పంజాబ్ సర్కార్ చర్య తీసుకుంటూ బటిండా ఎస్‌పీని సస్పెండ్ చేసింది.

Updated Date - 2023-11-26T13:45:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising