ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్ణీత క్రెడిట్స్‌ వస్తే చాలు డిగ్రీ ప్రదానం

ABN, First Publish Date - 2023-06-09T03:43:07+05:30

నూతన విద్యావిధానానికి అనుగుణంగా డిగ్రీల ప్రదానంలోనూ మార్పులు రానున్నాయి. విద్యార్థి నిర్ణీత క్రెడిట్స్‌ సంపాదిస్తే వాటిని ఆధారం చేసుకొని సర్టిఫికెట్‌, డిప్లొమో, డిగ్రీ పట్టాలు అందజేసే అవకాశం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూజీసీ నిపుణుల కమిటీ సిఫార్సు

న్యూఢిల్లీ, జూన్‌ 8: నూతన విద్యావిధానానికి అనుగుణంగా డిగ్రీల ప్రదానంలోనూ మార్పులు రానున్నాయి. విద్యార్థి నిర్ణీత క్రెడిట్స్‌ సంపాదిస్తే వాటిని ఆధారం చేసుకొని సర్టిఫికెట్‌, డిప్లొమో, డిగ్రీ పట్టాలు అందజేసే అవకాశం ఉంది. కనీస కాలపరిమితి ఎంత ఉండాలన్నదానితో సంబంధం లేకుండా వీటిని ప్రదానం చేయవచ్చు. కొత్త డిగ్రీల నామకరణంపై యూజీసీ నియమించిన నిపుణుల కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది. నూతన విద్యావిధానం ప్రకారం ఉన్నత విద్య కోర్సుల్లో ఎప్పుడైనా చేరి, ఎప్పుడైనా ముగించే అవకాశం ఉంది. అప్పటి వరకు చదివిన చదువులకు సర్టిఫికెట్లు, డిప్లొమోలు, డిగ్రీలు ఇచ్చే వీలుంది. అండర్‌గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమో, పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమోలు ఇవ్వవచ్చని నిపుణుల కమిటీ సూచించింది. ఆ సందర్భంగా నిర్వహించే పరీక్షలు, ఇతరత్రా సంపాదించిన క్రెడిట్ల ఆధారంగా వీటిని ప్రదానం చేస్తారు.

Updated Date - 2023-06-09T03:43:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising