ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rains in North : ఉత్తరాదిలో ఆకాశానికి చిల్లు

ABN, First Publish Date - 2023-07-23T01:23:44+05:30

ఉత్తర భారతంలో ఆకాశానికి చిల్లులు పడ్డాయి. వాయవ్యంలో కుండపోతలతో జనజీవనం స్తంభించి పోయింది. పశ్చిమ భారతంలో తెరిపినివ్వని వానలతో ఆర్థిక రాజధాని ముంబై ఉక్కిరిబిక్కిరైంది. హిమాలయ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడగా.. పీర్‌పంజాల్‌ శ్రేణుల్లో క్లౌడ్‌ బరస్ట్‌ అయ్యింది. శనివారం

సిమ్లాలో వరద ధాటికి ధ్వంసమైన నిర్మాణాలు

కుండపోతతో గుజరాత్‌ గడగడ.. లద్దాఖ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌

హరిద్వార్‌లో చిక్కుకున్న 40 మంది

ముంబైలో 20 సెం.మీ వర్షం

న్యూఢిల్లీ, జూలై 22: ఉత్తర భారతంలో ఆకాశానికి చిల్లులు పడ్డాయి. వాయవ్యంలో కుండపోతలతో జనజీవనం స్తంభించి పోయింది. పశ్చిమ భారతంలో తెరిపినివ్వని వానలతో ఆర్థిక రాజధాని ముంబై ఉక్కిరిబిక్కిరైంది. హిమాలయ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడగా.. పీర్‌పంజాల్‌ శ్రేణుల్లో క్లౌడ్‌ బరస్ట్‌ అయ్యింది. శనివారం కురిసిన వర్షాలతో ఉత్తర, వాయవ్య, పశ్చిమ భారత రాష్ట్రాలు గడగడలాడాయి. గడిచిన వారం రోజులుగా గుజరాత్‌పై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. శుక్రవారం సాయంత్రం నుంచి వాయవ్యంలో వర్షాల తీవ్రత పెరగడంతో.. వరద ఉధృతికి గుజరాత్‌లోని కీలక నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. నవ్‌సారిలో ఏకంగా 24 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. జునాగఢ్‌ వీధుల్లో వరద ఏరులై పారింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నీళ్లు, ప్రవాహం ధాటికి కొట్టుకుపోతున్న కార్లు, జంతువుల వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ద్వారక, భావ్‌నగర్‌, భారుచ్‌, రాజ్‌కోట్‌, గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనగా.. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఏరియల్‌ వ్యూ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. అటు పీర్‌పంజాల్‌ శ్రేణుల్లోని కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో శనివారం క్లౌడ్‌ బరస్ట్‌ జరిగింది. భారీ వర్షాలతో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే.. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, లోతట్టు గ్రామాలు నీటమునిగాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌కు తాజా వర్షాలతో జలకళ వచ్చింది. 690కి గాను.. 114 డ్యామ్‌లు నిండుకుండల్లా మారాయని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. పంజాబ్‌లోనూ భారీ వర్షాలు కురిశాయి.

40 మంది భక్తుల రెస్క్యూ..

ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలీ నది ఉధృతి కారణంగా.. యూపీ-ఉత్తరాఖండ్‌ సరిహద్దుల్లోని ఓ రోడ్డుపైకి భారీగా వరదనీరు వచ్చింది. దీంతో ఆ మార్గంలో హరిద్వార్‌ వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు వరదల్లో చిక్కుకుపోయింది. వరద ఉధృతిలో బస్సు ముందుకు కదల్లేకపోయింది. వెనక్కీ వెళ్లలేక నిలిచిపోయింది. ఆ సమయంలో బస్సులో 40 మంది భక్తులున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఎస్కవేటర్‌ సాయంతో భక్తులను సురక్షితంగా కాపాడారు. ఉత్తరకాశీలోనూ వర్షాలు తెరిపినివ్వడం లేదు. దీంతో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. యమునోత్రి జాతీయ రహదారిని మూసివేశారు.

ఉధృతంగానే యమున

మహారాష్ట్రను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముంబైలో 20.3 సెంటీమీటర్ల మేర వర్షం కురియడంతో జనజీవనం స్తంభించిపోయింది. రహదారులు జలమయమయ్యాయి. యవాత్మల్‌ జిల్లాలోని మహాగావ్‌ తహసీల్‌, ఆనంద్‌నగర్‌ తండా వరద నీటి దిగ్బంధంలో చిక్కుకుపోయింది. శుక్రవారం రాత్రి నుంచి ఆ తండా వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. భారత వాయుసేన రంగంలోకి దిగి.. శనివారం సాయంత్రానికల్లా.. ఆ తండాకు చెందిన 100 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అటు మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లా ఇర్షల్‌వాడీలో బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరుకుంది. మరో 10 మంది గాయపడగా.. 111 మందిని సహాయక బృందాలు కాపాడాయి. ఇంకా 83 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. యమునానది శనివారం కూడా ఉధృతంగా ప్రవహించింది.

Updated Date - 2023-07-23T01:23:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising