ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Metro Pillar: పిల్లలను నర్సరీ స్కూల్‌లో దించేందుకు స్కూటీపై వెళుతుండగా మెట్రో పిల్లర్ మీద పడి..

ABN, First Publish Date - 2023-01-10T14:22:19+05:30

కర్ణాటక (Karnataka) రాజధాని నగరం బెంగళూరులో (Bangalore) విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ అకస్మాత్తుగా కూలి రోడ్డు మీద స్కూటీపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాజధాని నగరం బెంగళూరులో (Bangalore) విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ అకస్మాత్తుగా కూలి (Metro Pillar Collapse) రోడ్డు మీద స్కూటీపై వెళుతున్న ఒక ఫ్యామిలీపై పడింది. ఈ ఘటనలో ఒక మహిళకు, వారి ఇద్దరి పిల్లలకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ, ఆమె రెండేళ్ల పసి పిల్లాడు చనిపోయారు. మరో చిన్నారి గాయాలతో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. చనిపోయిన ఆ వివాహిత పేరు తేజస్విని (28), బాబు పేరు విహాన్‌గా (2) తెలిసింది. బెంగళూరులోని నగవర ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

కల్యాణ్ నగర్ నుంచి హెచ్‌ఆర్‌బీఆర్ లే-అవుట్ వెళ్లే రోడ్డులో నిర్మాణంలో ఉన్న మెట్రో రైల్వే పిల్లర్ మంగళవారం ఉదయం 10.30 సమయంలో కుప్పకూలింది. అయితే.. అదే సమయంలో తేజస్విని అనే వివాహిత తన ఇద్దరు పిల్లలను నర్సరీ స్కూల్‌లో దింపి రావడానికి స్కూటీపై వెళుతోంది. దురదృష్టవశాత్తూ ఆ పిల్లర్ వీరిపై పడింది. ఈ ఘటన బెంగళూరు నగరంలో విషాదం నింపింది. తేజస్విని భర్త లోహిత్ కుమార్ బెంగళూరులోని టెక్ పార్క్‌లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. నగవర ప్రాంతంలో ఈ కుటుంబం నివాసం ఉండేది. ఇంత జరిగినా.. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఒక ప్రకటన కూడా విడుదల చేయకపోవడం గమనార్హం.

Updated Date - 2023-01-10T14:31:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising