ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Robot : సెన్స్‌ లేని రోబో చంపేసింది

ABN, First Publish Date - 2023-11-10T03:00:42+05:30

మానవ మేధతో కృత్రిమ మేధ పోటీ పడుతున్న యుగం ఇది. మనిషినే సవాల్‌ చేసే స్థాయికి రోబోలు చేరుకుంటాయా? అన్న కథాంశంతో అనేక సినిమాలు కూడా వచ్చాయి.

సెన్సర్‌ లోపంతో మనిషిని కూరగాయల

బాక్సుగా పొరబడి కన్వేయర్‌ బెల్ట్‌పై వేసింది

ఛాతీ, ముఖం నలిగిపోయి వ్యక్తి మృతి

దక్షిణ కొరియాలోని ఓ కంపెనీలో ఘటన

సియోల్‌, నవంబరు 9: మానవ మేధతో కృత్రిమ మేధ పోటీ పడుతున్న యుగం ఇది. మనిషినే సవాల్‌ చేసే స్థాయికి రోబోలు చేరుకుంటాయా? అన్న కథాంశంతో అనేక సినిమాలు కూడా వచ్చాయి. అయితే, మరమనిషి ఎన్నటికీ మనిషి కాలేదని నిరూపించే ఓ ఘటన దక్షిణ కొరియాలో చోటు చేసుకుంది. ఇది ఒకరి మృతికి కారణం కావటమే విషాదం. దక్షిణ జియోంగ్‌సాంగ్‌ రాష్ట్రం లోని ఓ వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీలో రోబో పనితీరును పరీక్షించటానికి వచ్చిన వ్యక్తి ఆ రోబో పొరపాటు కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. కూరగాయలతో ప్యాక్‌ చేసిన బాక్సులను కన్వేయర్‌ బెల్ట్‌ మీదికి చేర్చటం ఆ రోబో పని. సదరు రోబోను పనిలో పెట్టటానికి ముందు ఈ నెల 6వ తేదీన పరీక్షించాలని భావించారు. కానీ, రోబోలోని సెన్సర్లలో సమస్య తలెత్తటంతో 8వ తేదీన పరీక్షించారు. ఇది జరుగుతుండగానే.. సదరు వ్యక్తిని కూడా కూరగాయాల బాక్సుగా భావించి ఆ రోబో కన్వేయర్‌ బెల్ట్‌ మీద అదిమి పెట్టింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి ముఖం, ఛాతీ తీవ్రంగా నలిగిపోయాయి. అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ.. చికిత్స పొందుతూ మరణించాడు. రోబోల కారణంగా దక్షిణ కొరియాలో ఇటువంటి విషాదాలు జరగటం ఇదే తొలిసారి కాదు. గత మార్చిలో ఓ ఆటోమొబైల్‌ ఉత్పత్తుల తయారీ కంపెనీలో రోబో చేతికి చిక్కి ఓ కార్మికుడు గాయాలపాలయ్యాడు.

Updated Date - 2023-11-10T04:12:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising